దేవుడున్నాడా

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏

దేముడు ఉన్నాడా అనేది మానవుడికి ఎప్పుడూ సందేహమే.

పూజ్యులు గరికిపాటివారు ఆదిత్యహృదయం మీద ప్రవచనం చేస్తూ " హిరణ్యగర్భః " అనే నామాన్ని వివరించారు.

ఆనామానికి అర్ధం తేజస్సుని తనలో కలిగినవాడు అని అని. మరి బ్రహ్మగారిని కూడా హిరణ్యగర్భః అని కొలుస్తారుగా. 

సృష్టి జరగడానికి, నిలవడానికి, అంతమవడానికి తేజస్సు అవసరం. ఆఖరికి సూర్యుడి పుట్టకకు కూడా ఆ తేజస్సే కారణం.

ఆ తేజస్సే వేదాలలో చెప్పబడిన " తత్వమసి " - " అది నువ్వే ( నువ్వుగా ఉన్నావు ) " అన్నది. 

ఆ తేజస్సునే ఈశ్వరుడు, విష్ణువు, సూర్యుడు, ప్రవక్త, యేసు, గురువు అని వేరు వేరు పేర్లతో కొలుచుకుంటున్నారు. పేరు ఏదయినా మూలం తేజస్సే. అదే మన సనాతనధర్మం తెలియచేస్తున్నది. వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ తేజస్సు గురించిన ఆరాధనే ఉంది. ఫలానా రూపంలో ఉన్న దేముడి గురించి కాదు.

ఉ.దా చూద్దాం. రాత్రి కలగంటున్నాం. కలలోకి అమ్మాయి, ప్రక్కింటావిడ, పాము, ఎద్దు అలా రకరకాల జీవులు వస్తున్నాయి. నిజంగా వారు వస్తున్నారా?. మరునాడు నాకలలోకి ఎందుకు వచ్చి అలా చేసావు అని ఎవరినయనా అడగగలమా?. లేదు, ఎందుకంటే కలలో కనబడినవన్నీ " తనే " కనుక, భేదం లేదుకనుక.

అదే మన వేదాలు చెప్పినది. ఇప్పుడు జరుగుతూన్నది, మనం చూస్తూన్నది, మనకు అనుభవమవుతూన్నది బ్రహ్మగారి కల. " బ్రహ్మ సత్యం 

జగన్మిధ్య ". పైన మన కలలోకి వచ్చినవి అన్నీ మనరూపాలే అనుకున్నాం కదా. అంటే బ్రహ్మగారి కలలో ఉన్నవి అన్నీ ఆయనే ( బ్రహ్మగారే ) అని కదా. అంటే జీవులందరూ ( మనం ) బ్రహ్మస్వరూపాలే. అదే " అహం బ్రహ్మస్మి ". జీవుడే దేముడు. ఇది తెలుసుకుంటే జ్ఞాని, లేకపోతే అజ్ఞాని.

ఇదీ మన సనాతనధర్మ విశిష్టత. ఏ ఇతర ధర్మాలు కనీసం ఇలా ఆలోచించలేవు కూడా.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ