సత్యం అసత్యం

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" సత్యం- అసత్యం "

ఆదిశంకరులు " బ్రహ్మసూత్రాలకు " భాష్యం వ్రాసారు. " బ్రహ్మ సత్యం, జగత్ మిధ్య " అన్నారు శంకరులు. కాని అందరూ ఈ కనిపించేదంతా సత్యం అనుకుంటున్నారు. భాష్యకారులు సమావేశమయారు. సత్యాన్వేషణ సులభమా, అసత్యాన్వేషణ సులభమా, వాదనలు బాగానే జరిగాయి. చివరికి అసత్యాన్ని గుర్తించడం సులభం, దానితో సత్యం ఏమిటో తెలుస్తుంది అని తేల్చబడింది.

చీకటి అంటే ఏమిటి, వెలుతురు లేకపోవడం. చల్లదనం అంటే ఏమిటి, వేడి లేకపోవడం. సత్యం అంటే అసత్యం కానిది అని అనుకోవాలి.

అమ్మవారి ఒకనామం " పరమాణుః " - అంటే అణువుకన్నా పరము/భిన్నము అయినది. అణువు అంటే చిన్నది/సూక్ష్మమయినది. పరమాణువు అంటే అతిచిన్నది అని. మరి ఎంత చిన్నది అంటే ఋషులకు కూడా కష్టమే చెప్పడం. అందుకని నేతి ( న+ఇతి - ఇది కాదు ), నేతి అనుకుంటూ వెడితే అసలు విషయం తెలుస్తుంది. ఇది అసత్యం, ఇది అసత్యం అనుకుంటూ వెడితే సత్యం బయటపడవచ్చు. బియ్యంలో రాళ్ళు ఏరేసినట్లుగా.

మొదట పదార్ధమూలం ( ధాతువు ) చిన్నదనుకున్నారు. తరువాత ప్రోటాన్స్ అవీ చిన్నవనుకున్నారు. మొన్న హిగ్స్ బోసన్ ని కనిపెట్టి ఇదే చిన్నదని " గాడ్ పార్టికల్ " అని పేరుకూడా పెట్టేసారు. రేపు ఇంకా చిన్నది కనిపెట్టే అవకాసం లేకపోలేదు.

ఇదే మన ఋషులు చెప్పిన " నేతి - ఇదికాదు " అనే అసత్యాన్వేషణ. అదే మన సనాతనధర్మ ఉత్కృష్టత.

ఈరోజు పవిత్రమయిన ఆఖరి మాఘపాదివారం. ఆరోగ్యప్రదాత సూర్యదేవుడిని అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్ధిద్దాం. - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ