మనుస్మ్రుతి
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః "
యత్రైతాస్తు న పూజ్యంతే
సర్వాస్తత్రాఫలాః క్రియః"
- మనుస్మృతి 3:56
ఎక్కడ స్త్రీలు గౌరవింప/పూజింపబడుతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు అని.
మేము అమెరికా దోహా మీదుగా వెళ్ళాము. కాబిన్ లగేజ్ ఏమీ లేకపోవడంతో ముందరగా దిగిపోదామని దోహాలో విమానం ఆగగానే లేచి ముందరకు బయలుదేరాము.
ఇది మనకు బాగా అలవాటు. బస్, రైల్లో ఉన్నా సినీమాకు వెళ్ళినా ఎంతసేపయినా కూర్చుంటాం కాని ఇంక 2 ని.ల్లో వస్తుంది/అయిపోతుంది అంటే లేచి ద్వారం వేపు బయలుదేరిపోతాం. సినీమా అయితే స్క్రీన్ వైపే చూస్తూ తన్నుకుంటూ తోసుకుంటూ కూడా వెళ్ళిపోతాం.
ముందర ఒక అమెరికా ఆయనలా ఉన్నాడు, నడుస్తున్నాడు. షడన్ గా ఆగేడు, నేను కొద్దిగా ఎడంగా నడుస్తూన్నా నాచేతిలోని చిన్న బేగ్ ఆయనకు తగిలింది. అతను తోకత్రొక్కబడిన త్రాచులా వెనక్కు తిరిగిచూసాడు. మొహం అమ్రేష్ పురి మొహంలా ఎర్రగా కందగడ్డలా ఉంది. నేను సారీ అని అసలు ఎందుకు అలా షడన్ గా ఆగాడా అని ఎదరకు చూస్తే ఓ అమ్మడు కేబిన్ నుంచి సూట్కేసు తీస్తూంది. కొద్దిగా కష్టపడుతూంది. సాధారణంగా " ఎస్క్యూజ్ మి " అంటాం, అమ్మాయి కొద్దిగా ప్రక్కకు తప్పుకుంటే మనం ఎదరకు వెళ్ళిపోతాం. కాని అతను ఏమీ మాట్లాడకుండా మౌనమునిలా కాంగా సీరియస్ గా నుంచునే ఉన్నాడు. సరే మొత్తమ్మీద దిగాం.
ఆయన అలా షడన్ గా ఎందుకు ఆగాడో 3 వారాల తరువాత, అమెరికా వెళ్ళాక, తెలిసింది నాకు.
3వారాలదాకా మంచుపడుతూనే ఉంది ఎక్కడకీ వెళ్ళడానికి లేకుండా. ఓరోజు కొద్దిగా తెరిపిచ్చింది. మావాడు " ఓ పెద్ద మాల్ కి వెడదాం, రెడీ అవండి " అన్నాడు. వెళ్ళేముందు బ్రీఫింగ్ ( క్లాస్ పీకడం ) ఇచ్చాడు. 1. ఎవరైనా సామాన్లు తీసుకుంటూంటే ఆగాలి కాని వారి భుజాలమీంచి నెత్తిమీంచి మనం తీసుకోకూడదు. 2. కౌంటర్ దగ్గర ఎదరవారి నడ్డికి మన పొట్ట తగిలిస్తూ నుంచోకుండా కొద్దిగా ఎడంగా ఉండాలి. 3. చిన్నపిల్లలు కనబడితే ముద్దుగా ఉన్నా " చీ చీ " అంటూ బుగ్గగిల్లడాలూ అవీ చేయకూడదు. 4. అలా అని ఎవరైనా నవ్వినా హాయ్ అన్నా మూతిముడుచుకుని ఉండకూడదు, వెంటనే ఓ నవ్వు నవ్వాలి. 5. మనం నడుస్తూండగా ప్రక్కలనుంచి ఆడువారు కాని పిల్లలు కాని వస్తూంటే వెంటనే ఆగిపోయి వారు మనల్ని దాటివెళ్ళాకే ఎదరికి నడవాలి.
ఈ 5వ పోయింట్ వినగానే నాకు " తత్వం " బోధపడింది - దోహాలో విమానంలో ఆ అమెరికా ఆయన ఎందుకు షడన్ గా అలా ఆగిపోయాడో, ఆ అమ్మాయి బేగ్ దింపుకుని ప్రక్కకు తప్పుకున్నాక కాని ఎందుకు ఎదరకు వెళ్ళలేదో అర్ధమయింది.
ఆడువారికి చిన్నారులకు వారు ఇచ్చే గౌరవం చూసి ఆశ్చర్యం వేసింది, ముచ్చటేసింది - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment