త్రయి త్రింశతి
🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏
హిందువులకు ఇంతమంది దేవుళ్ళేమిటండి, 33 కోట్లదేవతలా అని ఆశ్చర్యపోతూంటారు చాలామంది.
" త్రయి త్రింశతి " అంటే 33 విధాలయిన/వర్గాలయిన దేవతలు. కోటి అనేపదానికి సంస్కృతంలో అర్ధం వర్గము/విధము.
ఈ 33 వర్గాలు ఏమిటంటే - 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 ( అష్ట ) వసువులు , ఇంద్రుడు, ప్రజాపతి - మొత్తం 33 వర్గాలు.
12 ఆదిత్యులు - ద్వాదశాదిత్యులు. ఒక్కో నెలకు ఒక ఆదిత్యుడు ఉంటారు. వీరు ధాత ( చైత్రం మొదలు ), అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, అంశుమంతుడు, త్వష్ట, విష్ణువు, భగుడు, పూషుడు, క్రతువు.
భగవద్గీతలో పరమాత్మ " ఆదిత్యానాం అహం విష్ణుః ( 10:21 ) " అన్నారు.
11 మంది రుద్రులు ( శివతత్వరత్నాకరం ప్రకారం ) - శివుడు, మహేశ్వరుడు, శంభుడు, శ్రీకంఠుడు, భవుడు, ఈశ్వరుడు, మహాదేవుడు, పశుపతి, నీలకంఠుడు, వృషధ్వజుడు, పరమేశుడు.
అష్టవసువులు - ఆపుడు ( వరుణుడు ), ధృవుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు.
ఇంద్ర
ప్రజాపతి
మొత్తం 33 వర్గాలు.
" రాముడితో కపివరుండు ఇట్లనియే " అన్న వాక్యం ముద్రణాదోషంతో " రాముడి తోక పివరు...." అయినట్లుగా 33 కోట్ల దేవతలు అని అనడం పరిపాటయిపోయింది - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment