పండితరాజ 7

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

17వ శతాబ్దంలో మాబంధువు, గ్రామవాసి అయిన జగన్నాధరాయలకు " పండితరాజ " బిరుదునిచ్చి గౌరవించారు.

" పండితరాజ " బిరుదు అంటే ఏమిటి, ఆకాలంలో ఏ అర్హతలున్నవారికి ఆ బిరుదును ఇచ్చేవారు లాంటి విషయాలను " జస్టీస్ మహాదేవగోవిందరానడే " అనే పండితుడు తనువ్రాసిన " మహారాష్ట్ర చరిత్ర " అనే అద్భుతగ్రంధంలో తెలియచేసారు.

మరాఠా, రాజస్థానీయం, కన్నడ భాషలలో " పండితరాజ జగన్నాధరాయలు " మీద అద్భుత గ్రంధాలు రచించబడ్డాయి అని తెలుస్తూంది. ఫ్రాంచెస్ బర్నియర్ వంటి విదేశీయాత్రీకులు ఈయనగురించి విశేషంగా ప్రస్తావించారు. బర్నియర్ " ఆయన శాస్త్రపాండిత్యం అనితరసాధ్యం " అని గౌరవించారు.

" శాస్త్రపాండిత్యం అనితరసాధ్యం " గురించి ఓ ఉదాహరణ. 17వ శతాబ్దంలో అప్పయ్యదీక్షితులు, భట్టోజీదీక్షితులు ఇద్దరూ ఉద్దండపండితులు. ఇద్దరి కావ్యాలకీ ఖండనలు వ్రాసారు పండితరాజ. అప్పయ్యగారు వ్రాసిన " చిత్రమీమాంస " కు ఖండన వ్రాసి చివరలో పండితరాజ ఇలా వ్రాసారు:

" సూక్ష్మం   ........చరణౌతవహామి "

అంటే " ఏ ఒక పండితుడైనను మత్సరమును విడిచి నేను ( చిత్రమీమాంసలో ) చూపిన దోషములలో తిరిగి ( నా ఖండనలో ) దోషములు చూపగలిగినచో నేను ఆ పండితుని పాదములను పట్టుకొనెదను " అని వ్రాసారు. 

ఇంతవరకూ ఎవరూ సాహసించలేదు అని తెలుస్తూంది.

అప్పయ్యదీక్షితులుగారు వ్రాసిన అద్భుత సంస్కృతకావ్యం " కువలయానంద " ను మామేనమామగారు తెనిగీకరించారు.

" పండితరాజ " మహాపదవికి వలసిన అర్హతలు:

1. సార్వభౌముని విద్వత్సభలో   

    ధర్మనిర్ణయం చేయుటకు తగిన సమర్ధత  

    కలవారై ఉండాలి.

2. సర్వశాస్త్రములలో విశారదుడై 

    ఉండాలి.

3. సర్వతంత్ర స్వతంత్రుడై 

    ఉండాలి.

4. తన జీవితకాలంలో  

    ఎప్పుడునూ ధర్మమార్గమును 

    విడువనివాడై ఉండాలి.

5. తన ధర్మములను    

    శాస్త్రోక్తరీతిలో పూర్తిగా 

    ఆచరించినవాడై ఉండాలి.

6. రాజాస్థానములలో ఉండి    

    మతవిషయక 

    నిర్వహణమందును,   

    ధర్మనిర్ణయమందును, 

    మతధర్మనిర్వహణమందును    

    నిపుణుడై ఉండాలి.

ఈ అర్హతలన్నీ ఉండడంవల్లనే ఈయనకు " పండితరాజ " బిరుదునిచ్చి గౌరవించి ఉంటారని తెలుస్తూంది.

కారణజన్ములు, అనితరసాధ్యులు. ఆయన కాలంలో తెలుగువారి ప్రతిభ ఖండాంతరాలు దాటింది.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ