పండితరాజ 2

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" కస్తూరికాం తృణభుజా  

                 మటవీచరాణాం, 

  వినస్య నాభిషు వధాయ వృధా 

                 చకార, 

  మూఢో విధి స్సకిల 

                 దుర్జనలోలజిహ్వా, 

  మూలేషు నిక్షిపతిచేత్ 

                 సకలోపకారః " 

17వ శతాబ్దంలో దిల్లీ బాదుషా అర్ధసింహాసన గౌరవం, పండితరాజ మరియు కవిసార్వభౌమ బిరుదులు పొందిన మాగ్రామవాసి బంధువు అయిన జగన్నాధపండితులు పైవిధంగా అలంకార పద్యం వ్రాసారు:

" కస్తూరిమృగం పిరికిది. ఎక్కడో అడవిలో గడ్డితింటూ తిరుగుతూ ఉంటుంది. దాని బొడ్డులో అద్భుతమైన కస్తూరి అనే సుగంధాన్ని పెట్టాడు దేముడు. ఈ సువాసనతో దాని జాడను పసిగట్టి దాన్ని చంపేసి కస్తూరిని దొంగిలిస్తారు వేటగాళ్ళు. దేముడా అంతటి సాధుజంతువుకి అలాంటిచోట పెట్టడానికి నీకు మనసెలా వచ్చిందయ్యా. నన్ను అడిగినా సలహా ఇద్దును కదా. కొందరు వితండవాదం చేసే మూర్ఖులు ఉంటారు. అలాంటివారి నాలుకలమీద ఈ కస్తూరిని పెట్టి ఉంటే వారి నాలుకలను కోసి తీసుకుపోయేవారు వేటగాళ్ళు. దానివల్ల సమాజానికి దేశానికి ఎంత ఉపకారం జరిగి ఉండేది " అని. ఎంత అద్భుత అలంకారం.

తనను విమర్శించే " విషయంలేని " వారిని దృష్టిలో పెట్టుకుని వ్రాసారు దీనిని అని పండితుల అభిప్రాయం. 

ఈయన అలంకారశాస్త్రంలో దిట్ట. ఈయన వ్రాసిన అద్భుత కావ్యం " రసగంగాధరం " కి 400 ఏళ్ళు అయినా ఎవరూ " ఖండన " వ్రాయడానికి సాహసించలేదు. ఈయన తన పరమగురువు ( గురువుతండ్రి )ని అవమానించారని ఒక పండితుడు వ్రాసిన " మనోరమా " కావ్యానికి " మనోరమా కుచమర్దనం " అని ఖండన వ్రాసి గురువు ఋణం తీర్చుకోవడమేకాక ఎందరో పండితులచేత అద్భుతకావ్యమని పొగడబడ్డారు.

ఆ " రసరమ్యత " ను అమ్మవారు ప్రసాదిస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ