సుబ్రహ్మణ్యషష్టి

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏

ఈరోజు పరమపవిత్రమయిన శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి. స్వామి జ్ఞానప్రదాత. తండ్రికే ప్రణవం గురించి బోధనచేసిన గురుగుహ.

ముత్తుస్వామి దీక్షితార్ ని తిరుత్తణిలో అనుగ్రహించారు స్వామి. అప్పటినుంచీ ఆయన కీర్తనలలో " గురుగుహ " అనే పదం ఉంటూవచ్చింది.

చిన్నప్పుడు ఈరోజు వస్తూందంటే 15 రోజుల ముందరనుంచీ సందడే. పెద్ద తీర్థం జరిగేది అందుకని.

తెల్లవారకట్ట 4 గం.లకే మాగ్రామానికి 1.5 కి.మీల దూరంలో ఉన్న కౌశికకి స్నానానికి నడిచి వెళ్ళేవారం. సైకిల్ ష్టాండ్ కి.మీ దూరంలో ఉండేది, పైగా 10 పైసల టికట్. అందుకని నడిచే పోయేవారం. అక్కడ సుబ్రహ్మణ్యుడిగుడి, శివాలయం ఉండేవి. స్నానం చేసి వచ్చేసేవారం. దర్శనానికి మధ్యాహ్నం భోజనం అయాక వెళ్ళేవారం. ఎందుకంటే తీర్థం అప్పుడే మొదలయేది.

తీర్థంలో రంగులరాట్నం, చక్రం ఆట, పీచుమిఠాయి, జీళ్ళు అన్నీ ఉండేవి. 2 గం.కు వెడితే మళ్ళీ రాత్రి 7 గం.లకే రావడం ( తిట్లు తినడం ).

ఎంత హాయిగా ఆనందంగా ఉండేదో. మధురస్మృతులు.

స్వామిని అందరికీ ఆనందాన్ని ప్రసాదించమని కోరుకుంటూ - సూర్య. 

అందరికీ శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి శుభాకాంక్షలు.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ