పండితరాజ 8
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" వానరాణాం వివాహేషు,
తత్ర గార్దభ గాయకాః,
పరస్పరం ప్రశంసంతి,
అహోరూప మహోధ్వనిః "
కోతుల వివాహానికి గాడిదలు గానం చేసాయిట. గాడిదలు కోతులని " మీరు ఎంత అందంగా ఉన్నారు " అని అంటే కోతులు " మీగాత్రం ఎంత అద్భుతంగా ఉంది " అని గాడిదలను మెచ్చుకున్నాయిట.
డబ్బాకొట్టుకోవటం 3 రకాలుట. ఒకటి తనను తాను " స్వ ". రెండోది ఇతరులను " పర ". ఇక మూడోది ఒకళ్ళని ఒకరు " పరస్పర ". పై పద్యం మూడో రకం కనుక " పరస్పరం " వాడారు జగన్నాధ పండితరాయలు.
వీరి విద్వత్తుకు అసూయపడిన తోటి పండితుల " కవిత్వాల, పరస్పర పొగడ్తల " గురించి ఆయన అలా అని ఉంటారని పండితుల/విమర్శకుల అభిప్రాయం.
ఇలాంటి " అలంకార " శ్లోకాలు చాలా వ్రాసారు కదా అసలు ఆయన మనస్సులో ఏముందని తెలుసుకోవడానికి కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఆయన వ్రాసిన " శాంత విలాసము " లో ఓ శ్లోకం చూద్దాం:
" సపది విలయమేతు రాజ్యలక్ష్మీః,
ఉపరి పతంత్వధ వా కృపాణ
ధారాః,
అపహరతుతరాం శిరఃకృతాంతో,
మమ తు మతి ర్నమనాగపైతు
ధర్మాత్ "
అంటే " రాజ్యలక్ష్మి విలీనమైనను ( లభించినను ), కత్తులమొనలు నా శిరస్సుపై పడినను, యముడు నా శిరస్సును అపహరించినను నా బుద్ధి ధర్మము నుండి ఏ మాత్రము ను చలించకుండుగాక " అని.
వారు అటువంటివారు కనుకనే " పండితరాజ* " బిరుదును పొందారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
*( ఇప్పటి పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇవ్వడానికి కొన్ని అర్హతలు ఉన్నట్లుగానే ఆ కాలంలో " పండితరాజ " బిరుదు ఇవ్వడానికి ఉండవలసిన అర్హతలేమిటో ఇంకోసారి తెలుసుకుందాం )
Comments
Post a Comment