వృక్షోరక్షతి
🙏 " శ్రీమాత్రేనమః " 🙏
వృక్షో రక్షతి రక్షితః
అమ్మవారి " సృష్టి " ఎంతలయబద్దంగా ఉంటుందో 10 రకాల పుష్పాలను పరికిస్తే చాలు తెలుసుకోవచ్చు. మనస్సు ప్రశాంతతను పొందుతుంది. వాటి రంగు, సువాసన, రేకలకూర్పు ( కొన్నింటిలో మకరందం ) - దేనికదే సాటి - ఎంత అద్భుతవిషయం.
శ్రీకృష్ణుడి కాలం కనీసం 5000 ల సంవత్సరాల క్రితం అని అందరూ ఒప్పుకున్నారు ( మనం ద్వాపరయుగం వారు అంటాం ). ఇప్పుడు తరచు వార్తలు చూస్తూ ఉంటాం - దారికి అడ్డుగానో ప్రయాణానికి అసౌకర్యంగానో ఉన్న పెద్దచెట్టును జాగ్రత్తగా తీసుకెళ్ళి వేరే చోట ప్రాతడం జరిగింది అని. అటువంటి వార్తలు చదివినా విన్నా కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటుంది.
కనీసం 5000 ఏళ్ళ క్రితం శ్రీకృష్ణుడు సత్యభామకోసం ఇంద్రలోకం నుంచి " పారిజాత " వృక్షాన్ని పెకిలించి తీసుకుని వచ్చి సత్యభామ ఇంటిపెరట్లో ప్రాతించారు అని పురాణాలు చెబుతున్నాయి.
అంటే అటువంటి ప్రక్రియ సాధ్యమే అని మన ఋషులు వేలఏళ్ళక్రితమే గ్రహించారని తెలుసుకోవాలి.
మా ఇంటిపెరట్లో నా చిన్నప్పుడు అవిశిచెట్టు ఉండేది. కాయలు పువ్వులు కూడా కూరచేసుకునేవారం. ఆశ్చర్యకరంగా అది కొబ్బరిచెట్టులా నిటారుగా పెద్దగా అయిపోయింది. ఓరోజు మా బాబయ్యగారు ఆచెట్టుని చూసి మానాన్నగారితో " బాగా పెరిగిపోయింది, కొట్టేయాలి, పురుగులు వస్తాయి " అన్నారు. వారం రోజుల్లో మాడిపోయింది చెట్టు. అంత సున్నితం మొక్కల మనస్సు. జాగ్రత్తగా మాట్లాడాలి.
ఇప్పుడు అవిశగింజలను కొనుక్కుని తింటున్నారు - మోకాళ్ళలో గుజ్జుపెరుగుతుందని.
ఎంతటి అద్భుతమైనది మరియూ శాస్త్రీయమైనది మన సనాతనధర్మం.
అటువంటి ధర్మాన్ని రక్షించుకోవలసిన బాధ్యత అందరిమీద ఉన్నది. దానిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. " ధర్మో రక్షతి రక్షితః " - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment