ఋషీ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు "🙏 

" ఋషి " అంటే అతీంద్రియమయిన జ్ఞానాన్ని దర్శించినవారు. శాస్త్రజ్ఞులు కూడా ఋషులే.

గెడ్డంపెంచుకుని ముక్కుమూసుకుని ఓమూల కూర్చుని ఉంటారు అని సామాన్యుల భావన. సినీమాలు మనల్ని అలా అనుకునేలా చేసాయి. వారు కారణజన్ములు. వారు ఏది చేసినా లోకకళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకునే.

అటువంటివారు జీవించేది లోకకళ్యాణంకోసం. 

రామాయణంలో 27 రకాల ఋషుల వివరణ ఉంది. 27 ఋషులుకాదు, 27 రకాల ఋషులు. కొందరు నీరునుమాత్రమే, కొందరు గాలినిమాత్రమే, కొందరు గాలిలో తేలుతూ, కొందరు సూర్యరశ్మినే అహారంగా తీసుకుంటూ ఇలా అనేక ఋషులు లోకకల్యాణం కోసం తపస్సు చేస్తున్నారు అని.

మాతంగ మహర్షి శబరితో " నేను వచ్చినపని అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, త్వరలో రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారు, వారిని సేవించుకుని తరించు " అని చెబుతారు. వస్తున్నారని

తెలిసినా రామలక్ష్మణులకోసం ఆగలేదు మహర్షి.

ఓ సమయంలో భరతవర్షమంతా విపరీతమయిన కరువుకాటకాలు. వర్షాలు లేవు, నీటిచుక్కలేదు.

గౌతమమహర్షి వరుణదేవుడి గురించి తపస్సు చేస్తారు. ఆయన ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగితే " వెంటనే వర్షాలు కురిపించు, ప్రజలు అల్లాల్లాడిపోతున్నారు " అంటారు మహర్షి.

వరుణుడు అంటారు " అలా కురిపించేయడం కుదరదు. వారివారి కర్మలనుబట్టి బాధలు అనుభవిస్తారు. అది పరమాత్మ ఏర్పాటు. నువ్వు కోరితే తపస్సు చేసావుకనుక నీకు నీళ్ళు ఏర్పాటుచెయ్యగలను " అంటాడు. సరే అయితే అలాగే చెయ్యి అని, ఓ చెరువు లాంటిది నిండగానే నీటిని తనవెనకే రమ్మని ముందర నీరులేని ఓ దిక్కుగా ప్రయాణించారు. అది ఒక నది అయింది. తరువాత ఇంకోవైపుకి అలా అన్నివైపులకు ప్రయాణం చేసి కరువుని పోగొట్టారు. గౌతమి మొ.గు నదులు అలా వచ్చినవే.

అలా ఉంటాయి ఋషుల ప్రయత్నాలు. ఏ ఋషి జీవితం చూసినా అద్భుతమే. వారి పనులన్నీ లోకకళ్యాణం కోసమే.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ