ప్రత్యంగిరాదేవి

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏

కోయంబత్తూర్ సమీపంలో " ప్రత్యంగిరాదేవి " ఆలయం ఉంది. దానికి స్థలపురాణం ఉంది. 

నృసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపినతరువాత చాలాకాలం ఆ కోపం/ఉగ్రం లోంచి బయటకు రాలేక అడవులు పట్టితిరుగుతున్నాడు. బ్రహ్మ, ఇంద్రుడు వంటివారంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో శివుడిని వేడుకున్నారు ఏదోఒకటి చేసి ఆయన్ని మామూలుగా చెయ్యమని.

శివుడు సరే అని శరభుడుగా వచ్చి స్వామికి అడ్డుగా నుంచున్నారు. ఆయన మీదకే స్వామి కోపంగా దూసుకుని వెళ్ళారు. శరభుడి కుడిచేతిలో ప్రత్యంగిరాదేవి కూర్చుని ఉంది. శివుడి మీదకే స్వామి కోపంగా రావడంతో లేచినుంచుంది కోపంతో.

ఆవిడ " సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్....." - వేల శిరస్సులు, ఎర్రటి వేలకళ్ళు, ఆయుధాలతో కూడిన వేల చేతులు. కోపంతో హుంకరించేటప్పటికి నృసింహస్వామి భయపడిపోయి చల్లబడిపోయాడు.

ఆవిడ " అయ్యో ఎదురుగా ఉన్నది నా సోదరుడు, ఎలా కోప్పడేదీ " అనుకోలేదు. అనుకుంటే స్వామి ఉగ్రంలోంచి బయటకు రాడు, లోకాలూ తల్లడిల్లిపోతాయి.

అందుకని అవసరమయినప్పుడు కోపం తెచ్చుకోవాలి. తప్పులేదు.

ఎవరికోపాన్ని చూస్తే దేవతలు కూడా భయపడిపోతారో అతనే శ్రీరాముడు అని

సెలవిచ్చారు. అంటే జగదానందకారకుడు శ్రీరాముడుకి కూడా కోపం ఉన్నట్లేగా.

అమ్మవారి పేర్లు " ఛండి, మహాసన, మహాగ్రాస " - కాళి రూపంతో మొత్తం సృష్టినంతటినీ లోపలికి లాగేసుకుంటుంది అవసరమైతే. అవసరమైతేనే లేకపోతే ఆవిడ " అవ్యాజకరుణామూర్తి " - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ