మిత్రులు - ఉత్తములు
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" ఉత్తమానాం స్వభావోయం,
పరదుఃఖః అసహిష్ణుత,
మయం దుఃఖంచ సంప్రాప్తం,
మన్యతే అన్యస్యవార్యతే "
. - వ్యాసర్షి, మహాభారతం
ఉత్తములు ఇతరుల దుఃఖాన్ని తట్టుకోలేరు. తాము బాధపడతారు ఇతరుల దుఃఖాన్ని పోగొట్టడానికి.
మిత్రులు అందరూ ఉత్తములే, తోటి మిత్రుల బాధలను పంచుకునేవారే. కిం సంశయం?
పూజ్యులు చాగంటివారి దగ్గరకు ఓ పెద్ద కాలేజి నడిపే ఆయన వచ్చి " మా కాలేజీ ఆడిటోరియంలో మహాభారతం ప్రవచనం చేయమని మిమ్మల్ని అడగడానికి వచ్చాను " అన్నారుట ( ఈ విషయం చాగంటివారే చెప్పారు ).
" భేష్ మంచి ఆలోచన, తప్పకుండా చేస్తాను " అన్నారు గురువుగారు.
కాలేజీ ఆయన అన్నారు " అందరూ యువతీ యువకులు కనుక మీరు దయచేసి ద్రౌపదీ వస్త్రాపహరణం, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టడం లాంటివి వదిలేసి మిగతావి చెబితే బాగుంటుంది " అనడంతో ఈయన నవ్వి " మహాభారతం అంటే అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటేనే భారతం, అందుకని అన్నీ చెబుతాను " అన్నారుట.
అలాగ వాట్సప్ అన్నాక అన్నీ ఉంటాయి. మనకు నచ్చేవి నచ్చనివి అన్నీ ఉంటాయి. ఎవరికి కావలసినవి వారు చూసి ఆనందిస్తారు.
పట్టుబట్టకట్టుకుని, వీభూతి వ్రాసుకుని శివాలయంకి వెడుతూంటే గోవులేకాదు కుక్కలు పందులు గేదెలు గాడిదలు కూడా ఎదురుపడి చికాకు పెడతాయి. ఇప్పుడు 24 గంటలూ మందుకనుక ఫుల్ గా త్రాగేసి తూలుకుంటూ వచ్చి మీద పడుతూంటారు కూడా జనాలు. తప్పించుకుంటూ ఇటూఅటూ చూసుకుంటూ గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి. అంతే కాని వీటన్నింటికీ భయపడి గుడికి వెళ్ళడం మానేయకూడదు.
తనకు ఏది ఆనందం ఇస్తుందో మనసువిప్పి ఒకరు ఎవరికి చెప్పుకోగలరు, మిత్రులకు తప్ప. కొంచెం అసౌకర్యంగానూ బాధగానూ ఉన్నా మిత్రుడి భావాన్ని గౌరవించే మనసున్నవాడు మిత్రుడే.
ఆ రకంగా ముందుకు పోదాం. జై ....
ఏతత్ సర్వం శ్రీశ్రీశ్రీ వాట్సపార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment