భారతదేశం
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" అగ్నిమిచ్ఛధ్వం భారతాః " - ఓ భారతులారా మనం అగ్నిని ఆశ్రయిద్దాం - వేదం.
" భరత్వ రమణత్వాత్ భరతః " - అంది వేదం. అంటే పోషించేవాడు, ఆనందాన్నిచ్చేవాడు భరతుడు అని అర్ధం. భరత్వం అంటే భరించుట, రక్షించుట. ఈ రెండూ చేస్తున్నది పరమేశ్వరుడు. అందుకే ఆయన్ని " భరతుడు " అంది వేదం.
ఆ భరతుడిని పూజించేవారు భారతీయులు అంటే మనం. ఆ యజ్ఞాలను ఆచరించి, యజ్ఞాలద్వారా జీవించే యజ్ఞభూమికి " భరతవర్షం/భరతదేశం " అని పేరు. భారతదేశంలో జీవించేవారికి భారతీయులు అని పేరు. ఆ రకంగా మనమందరం భారతీయులుగా అయాం, జీవిస్తున్నాం, పిలువబడుతున్నాం, గౌరవించబడుతున్నాం.
ఇతరదేశాల్లో మతం వేరు, విజ్ఞానం వేరు. ఆ రెండూ వేరు వేరు వ్యక్తులచేతుల్లో ఉంటాయి. మన దేశంలో అలాగకాదు. ఋషులే మతాన్ని, అందులోనే అత్యంత అద్భుతమైన, సాటిలేని విజ్ఞానాన్ని ఇచ్చారు.
హమారా భారత్ మహాన్ - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment