శ్రీలలితానామం 866 867- సూర్య

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" అజా, క్షయవినిర్ముక్తా " - అమ్మవారి అద్భుతనామాలు. 

ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 866,867వ నామాలు.

" అజా " అంటే పుట్టుక లేనిది. " క్షయవినిర్ముక్తా " అంటే మరణంలేనిది. " పుట్టుక లేనిది " అంటే పుట్టుక ఎప్పుడో కనిపెట్టలేకపోయారు అనుకోవాలి. మరి ఎలా తెలిసింది. మా ఇంటిముందర ఓ పెద్ద రావిచెట్టు ఉండేది. మా అమ్మగారిని " రావిచెట్టు మామ్మ " అని పిలిచేవారు మా బంధువులు. ఆ రావిచెట్టు ఎప్పటినుంచి ఉంది అంటే " ఏమో మీ తాతగారికే తెలీదు " అనేవారు మా అమ్మగారు. ఇప్పుడు భూమి పుట్టి ఎన్నాళ్ళయింది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో ఒక మార్గం యురేనియం రేడియేషన్ కొలవడం. 

మన ఋషులు తమ తపశ్శక్తిని, జ్ఞాననేత్రాలను ఉపయోగించి " అమ్మ వారు " ఎప్పుడు పుట్టి ఉంటారూ " అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటారు.

ఆ ప్రయత్నంలోనే వారు యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలను దాటి బ్రహ్మ వరకూ వెళ్ళి కాలగణన చేసి తెలియచేసారు.

ఈ అద్భుత విషయాలను చదివేనేమో 1866 లోనే గ్రీకు జ్యోతిషపండితుడు " కీరో " - భారతీయుల కాలగణన " అద్భుతం " అన్నారు ( ఈయన పేరు ఎందుకంటే " పెరటిమొక్క వైద్యానికి పనికిరాదు " అని సామెత. విదేశీయుడు పైగా గ్రీకు వాడు కనుక ఆయన మాటకు విలువ ఎక్కువ ).

అందుకే వివేకానందులు " ప్రపంచమతాలన్నిటికీ మన హిందూ సనాతన ధర్మమే తల్లి " అన్నారు. 

ఇంకా ఆశ్చర్యకరం ఆనందకరమైన విషయం ఏమిటంటే డేవిడ్ ఫ్రాలే అనే ఆయన అమెరికా పౌరుడు. మన వేదవిజ్ఞానానికి దాసోహమని " వామదేవశాస్త్రి " గా పేరు మార్చుకుని మన " వేదాలు, ఉపనిషత్తులు, ఆయుర్వేదం " లకే జీవితాన్ని అంకితం చేసి ఎన్నో పరిశోధనలు చేసి " గాడ్స్, సేజెస్ & కింగ్స్ " అని పుస్తకం వ్రాసారు. ఆయన అన్నారు " ప్రపంచ జ్ఞానానికి తల్లి ఎవరంటే భారత దేశంలోని హిమాలయ పర్వతసానువుల్లో పుట్టిన వేదవిజ్ఞానమే " అని. ఈయనకు మనదేశం " పద్మభూషణ్ " ఇచ్చి గౌరవించింది.( ఈ విషయాలు ఆయనపేరు కొట్టి చూస్తే గూగుల్లో కనబడతాయి).

అమెరికా జరిపే అంతరిక్షపరిశోధనలకు వాటి ఫలితాలకి " మూలం " ఏమిటీ అనికూడా కొంచెం ఆలోచన చెయ్యవచ్చు. ఋగ్వేదం ( 10:129 ) లో " నాసదీయ సూక్తం " ఉంది. అది సృష్టివివరణ. " నాసా " అనే పేరు కూడా మన తాళపత్రగ్రంధాలలోంచి వచ్చిందేమో.

ఎంతటి అద్భుతం భారతీయ వేదవిజ్ఞానం. విషయాలు చూస్తూంటే వేదాలు " దైవముఖం " గా వచ్చినవే అని చెప్పడంలో సంశయం కిం?.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య

శుభం భూయాత్

Comments

  1. సామవేదం నారాయణ శర్మ పేరు మీద నాసా అని పెట్టుంటారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ