పదవీ వ్యామోహం

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏


" అనన్యాశ్చింతయంతో 

  మాం ఏజనాః పర్యుపాసతే,

  తేషాభియుక్తానాం 

  యోగక్షేమం వహామ్యహం " 

                 - భ.గీత 9:22

పరమాత్మ " ఇతరవిషయాల గురించి ఆలోచన చెయ్యకుండా నన్నే ఎవరు సేవిస్తారో వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను " అన్నారు.

పాండవులను అలాగే ఆదుకున్నారు స్వామి. ఆఖరికి రాయబారానికి కూడా స్వయంగా వెళ్ళారు.

" నరుతే శ్రాంతస్య సఖ్యాయదేవాః " - ఋగ్వేదం. ఎవరైతే కష్టపడరో వారికి దేవతలు కూడా సహాయపడరు అంది వేదం.

దీని అర్ధం కష్టపడేవారికి దేవుడు తోడుంటాడు అని.

చాగంటివారు, మెట్రో శ్రీధరన్, స్వామినాథన్ వంటివారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

చాగంటివారు పరమాత్మను నమ్ముకున్నవారిలో ముఖ్యులు. మిగతా ఇద్దరు కష్టపడేవారిలో ముఖ్యులు.

అలాంటివారి యోగక్షేమాలు చూడడానికి పరమాత్మ ఎప్పుడూ తయారుగా ఉంటారు.

ఏదో ఒక బలహీనక్షణంలో పై ముగ్గురు పదవీవ్యామోహానికి లోనయి పదవులను తీసుకుని ఉంటే ఈ పాటికి ఏదో ఒక స్కాంలో ఇరుక్కుని కటకటాలు లెక్కిస్తూ ఉండేవారు.

చాగంటివారు టిటిడిలో పదవి వద్దన్నదికూడా పరిస్థితులు గమనించే అనుకోవాలేమో.

పరమాత్మ " మమ మాయా దురత్యయా " అన్నా మాయలో మరీ మునిగిపోయేలా చేయకుండా అనుగ్రహించమని పరమాత్మను వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ