విష్ణుసహస్రం -1 - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

విష్ణుసహస్రనామ స్తోత్రం లో " భయకృత్ భయనాశనః " అనే నామాలు ఉన్నాయి - అంటే భయాన్ని కలిగించేదీ ఆయనే భయాన్ని నాశనం చేసేదీ ఆయనే. అదెలాగా భగవంతుడు మన భయాన్ని పోగొట్టాలి కాని కలిగించడం ఏమిటీ అన్నది ఒక మంచి ప్రశ్నే. 

భయం అనేది ఒక వరం, అది లేకపోతే ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. ఒకాయన ఇంకో ఆయనతో గొడవపడతాడు, అవతలి వాణ్ణి హత్యచేసేద్దామన్నంత కోపం వచ్చేస్తుంది. హత్య చేయడానికి కావలిసిన బలం, డబ్బు, బలగం అన్నీ ఉంటాయి. వీటితోపాటు అతని అదృష్టం కొద్దీ కొద్దిగా భయం కూడా ఉంటుంది. ఏమనీ అంటే ఎంతజాగ్రత్తగా హత్య చేసినా ఎలాగైనా పొలీసులు పట్టేస్తారు, కోర్టు ఉరిశిక్షో యావజ్జీవమో వేస్తుంది, ఇంతబ్రతుకు బ్రతికి అలాంటి శిక్ష తనకీ తన కుటుంబానికీ ఎంత అవమానకరం అని ఓ క్షణం భయపడతాడు , కోపం నుంచి బయటపడతాడు మళ్ళీ ఆనందమయమైన జీవితం గడుపుతాడు. 

ఎక్కువమందిలో భగవంతుడు కలుగచేసిన భయం ఉంటుంది. దానివల్ల కష్టాలనుంచి తప్పించుకుంటారు. 

కొద్దిమంది మాత్రమే ఈ భయాన్ని పట్టించుకోక తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తారు, ఎందుకంటే " ప్రారబ్దం భోగతో నశ్యేత్ " అన్నారు , అనుభవించడం వల్లే వారి ప్రారబ్దం ( పూర్వజన్మ పుణ్యమైనా పాపమైనా ) నశిస్తుంది కనుక.

డబ్బు ఎప్పుడూ చాలులే అనిపించదు. ప్రోగుచేస్తూనే ఉంటాడు నానా గడ్డీ కరుస్తూ. ఏదో ఒకరోజు పట్టుబడడం, శిక్షపడడం జరుగకమానదు అనే కొద్దిపాటి భయం ఉంటే బయటపడతాడు. కాని అటువంటి భయాన్ని తనను నమ్ముకున్నవారికి, భక్తులకే కలుగచేస్తాడు పరమాత్మ.

ఈరోజు " మతత్రయ ఏకాదశి " శుభదినం.

ఏతత్ సర్వం శ్రీపరమాత్మార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ