నారదమహర్షి గొప్పదనం - సూర్య
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
నారదులవారు దేవర్షి. ఋషివ్యవస్థ అంటే ఈశ్వరసంకల్పాన్ని భూమిమీద ప్రవర్తింపచేసే వ్యవస్థ. ఋషుల్లో దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు ఉంటారు.
" నారం దదాతి ఇతి నారదః " అన్నారు. నారం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్ధం.
రత్నాకరుడు అనే కిరాతకుడికి " రామ " నామాన్ని ప్రసాదించడంతో అతను వాల్మీకిగా మారాడు. వాల్మీకి మనకు అద్భుతమైన రామాయణ ఇతిహాసాన్ని ప్రసాదించాడు.
మహాభారతం వ్రాసాక వ్యాసులవారు నారదుడితో " మనోవ్యాకులతతో బాధపడుతున్నాను, ఏమి చెయ్యమంటారు " అని అడిగితే " భాగవతం " వ్రాయి, అన్ని బాధలు తొలగుతాయి అన్నారు నారదులు. అలా భాగవతం వచ్చింది మనకు.
ప్రహ్లాదుడికి " ఓం నమో నారాయణాయ ", ధృవుడికి " ఓం నమో భగవతే వాసుదేవాయ " మహా మంత్రాలని ప్రసాదించి చరితార్ధులయేలా అనుగ్రహించారు.
సనకసనందనాదులకి " నారదపురాణం " ని అనుగ్రహించారు. దానిలోనిదే అద్భుతమైన " సంకటనాశన గణేశస్తోత్రం ".
దక్షప్రజాపతి తనకుమారులకు తత్వబోధచేసి వారిని విరక్తులుగా చేసాడని నారదులవారిని " నీకు ఏలోకంలోనూ స్థానం ఉండదు " అని శపించాడు. అందుకే నారదులు త్రిలోకసంచారి.
నారదులు సంగీతజ్ఞానానికి మహర్షి. త్యాగయ్యగారు శ్రీరామ జపపారాయణం చేస్తే నారదులవారు ప్రత్యక్షమయారు. అప్పుడే ఆయన:
" శ్రీనారదముని గురురాయ
కంటి, ఏనాటి తపమో
గురురాయ............."
కీర్తన చేసారు.
ఇంతటి అద్భుత మహర్షిని మనకు తంపులు పెట్టేవానిగాను, ఇక్కడ కబుర్లు అక్కడ చెప్పేవానిగానూ తెలియచేసారు.
ఇప్పటికైనా జాతి మేలుకుని మన సనాతనధర్మం గురించి ముఖ్యంగా మన మూలాలగురించి తెలుసుకుంటారని ఆశిద్దాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment