" సంస్కృతి - సంస్కృతం "- 1 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" సంస్కృతి - సంస్కృతం "- 1

" ఉతదేవా అవహితం 

  దేవా ఉన్నయధా పునః "      

                   - ఋగ్వేదం.

" అవహితం " అంటే అడుగున ఉన్నవారు అని - " అలాంటి వారిని పైకి తీసుకురా పరమాత్మా " అని దేవుడిని ప్రార్ధించడం.

" ఉతగాస చ కృషం 

  దేవా జీవయధా పునః " 

               - ఋగ్వేదం.

" అగాస " అంటే మళ్ళీ మళ్ళీ అని. " మళ్ళీ మళ్ళీ అపరాధాలు చేసేవారిని కూడా క్షమించు దేవా " అని దేవుడిని ప్రార్ధించడం. 

ఎంత అద్భుతం మన వేదవాగ్మయం.

" దీనజనోద్ధరణ " అనే ప్రక్రియను వేల ఏళ్ళ క్రితమే ప్రారంభించింది మన సనాతనధర్మం 

రావణుడు మరణించాక సీతమ్మను రాముడివద్దకు తీసుకువెళ్ళడానికి వస్తారు హనుమ. అంతవరకూ సీతమ్మను సూటిపోటిమాటలతో హింసించిన రాక్షస స్త్రీలు బిక్కుబిక్కుమంటూ చెట్ల వెనక దాక్కుని చూస్తూ ఉంటారు. హనుమ కోపాన్ని ఆపుకోలేక " ఊ అనమ్మా, ఒక్క గుద్దుతో చంపేస్తాను వీరినందరినీ " అని అంటే సీతమ్మ అంటారు " అకశ్చిన్ అపరాధతే " - అపరాధం చేయనివారు ఎవరు నాయనా. పరిస్థితులు అలా చేయిస్తాయి అంటారు.

ఎంత అద్భుతం మన సంస్కృతి, సంస్కృతవాగ్మయం. 

" సర్వేజనాః సుఖినోభవంతు, వసుధైక కుటుంబం " అనే భావనలతో ఉండేది సనాతనధర్మపరులే.

సనాతనధర్మానికి సాటిలేదు, రాబోదు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ