3వ భాగం - " సంస్కృతి-సంస్కృతం " - 3 - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సంస్కృతి-సంస్కృతం " - 3
( 28/12/2023 ఉదయం నేను పోష్ట్ చేసిన " సంస్కృతి - సంస్కృతభాష " విషయానికి ఇది కొనసాగింపు ).
రూస్ ( రష్యా ) దేశస్తుడైన " లూయీరేణు " అనే పండితుడు మన సంస్కృతభాష మీద చేసిన పరిశోధనలు అద్భుతం. అవి తరువాత తెలుసుకుందాం, ముందు ఆయన మన దేశం నుంచి తిరిగివెళ్ళిపోతూ అన్న క్రింది మాటలు చదవండి :
" నేను ఒకే ఒక దుఃఖంతో భారతం నుంచి నా స్వదేశానికి వెడుతున్నాను. మేము పుట్టుకచేత యూరోపియన్లమైనా ఏ అమృత ( సంస్కృత ) భాషను ఆధారంగా చేసుకుని భాషావిషయక పరిశోధనలు చేస్తున్నామో, అమృతలక్షణలక్షితమైన ఆ భాషనే భారతీయులు కొందరు " మృతభాష " అంటున్నారు. భారతీయుల మరో దౌర్భాగ్యానికి నిదర్శన మేమిటంటే ఈ దేశంలో విద్యాశాఖాధికారులకు కూడా సంస్కృతం రాదు " అని.( అప్పుడు ఆయన ఊహకి కూడా అంది ఉండదు, భవిష్యత్తులో ఇక్కడ అక్షరం ముక్కరాని వారు " విద్యాశాఖమంత్రులు, విశ్వవిద్యాలయ అధిపతులు " అవుతారని ).
ఇప్పుడు విషయానికి వద్దాం. ఆయన అనే ముఖ్య విషయం ఏమిటంటే " అందరూ ఆంగ్లభాషకు లాటిన్ పదాలు మూలమంటున్నారు " కాని లాటిన్ పదాల మూలాలు సంస్కృతంలో ఉన్నాయి అని. క్రింది పదాలు చూడండి.
సంస్కృతం లాటిన్ ఆంగ్లం
మాతృ మాటర్ మదర్
పితృ పిటర్ ఫాదర్
భాతృ భాటర్ బ్రదర్
దుహీతృ దిహితర్ డాటర్
ఆయన వీటితో ఆగలేదు. ఎన్నో పదాలకు మూలాలు వెదికారు. వాటిలో కొన్ని:
1. " సాయకీలః " - " అయః
కీలై స్సహితః " అంటే
ఇనుపకడ్డీలతో కూడినది
అని అర్ధం. అదే " సైకిల్ "
అయింది.
2. " ఫలావరః " - " ఫలం
అవరం యస్మాత్ " అంటే
పువ్వుకి క్రింది భాగంలో
కాయ తయారై క్రమంగా
పండు అవుతుంది.
ఈపదం ఫలావర్, ఫల్
వర్ అయి ఫ్లవర్ గా
ఆంగ్లంలో నిలిచింది.
3. " కలాకః " - " కై శబ్దే "
ధాతువు అంటే శబ్దంతో
సమయాన్ని తెలిపేది అని
అర్ధం. అదే " క్లాక్ "
అయింది.
ఇలా ఎన్నో ఆంగ్లపదాలకు మూలాలు సంస్కృతంలో ఉన్నాయని గ్రహించి " కొలంబియా, షికాగో, వాషింగ్టన్ " యూనివర్శిటీలలో భాషాశాస్త్రాలపై పరిశోధనలు చేస్తూన్న భాషాపండితులు ప్రపంచంలో ఉన్న పదాలన్నిటికీ కూడా సంస్కృతపదాలే మూలం అన్నట్లుగా తెలుస్తూంది అనే నిర్ణయానికి వచ్చారుట.
అమెరికా పండితుడు " మీనార్డ్ " మన దేశానికి వచ్చినప్పుడు అమెరికా గ్రంధాలయాల్లో 6700 సంస్కృతలిఖితగ్రంధాలు ఉన్నాయని తెలియచేసారు.
ఇక జర్మనీ పండితుడు " మేక్స్ ముల్లర్ " సంస్కృతభాష మీద తన అభిమానాన్ని ఎలా చాటుకున్నారో రేపు తెలుసుకుందాం.
హమారా సనాతనధర్మ మహాన్.
లోకాః సమస్తాః సుఖినో భవంతు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment