జ్యోతిషం నమ్మవచ్చా - సంస్కృతి - సంస్కృతం 6 - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సంస్కృతి - సంస్కృతం 6 "
క్రితం పోష్టు( సంస్కృతి - సంస్కృతం 4 )లో " కీరో " అని ఐరిష్ జ్యోతిష్కుడి పేరు వ్రాయడం జరిగింది. ఆయన అసలు పేరు " విలియం జాన్ వార్నర్ ( 1866-1936) ".
కొందరికి " పూర్వజన్మ " వాసనల వలన అనుకోవచ్చు చిన్నప్పటినుంచీ పాటలుపాడడం, కవితలు వ్రాయడం, కధలువ్రాయడం, ఆటలుఆడడం లాంటి ప్రత్యేకతలపై ఎక్కువ ఆసక్తి ఉండి చిన్నవయస్సులోనే దానిలో నిష్ణాతులవుతారు.
అలాగే ఈ కీరో కి భారతీయ సాముద్రికం మీద ఆసక్తి కలిగి, నేర్చుకోవాలని అనుకుని ఎవరో " భారతదేశం వెళ్ళు, అక్కడ ఎందరో పండితులు ఉన్నారు " అని సలహా ఇవ్వడంతో ఓడ ఎక్కి బొంబాయి చేరుకున్నాడు. అక్కడివారు చెప్పడంతో " కొంకణ్ " తీరానికి వచ్చి ఒక పండితుణ్ణి కలిసాడు. ఇతని ఆసక్తి, శ్రద్ధ చూసి ఆయన శిష్యుడిగా చేర్చుకుని 2 సం.లు విద్యనేర్పారు.
ఆ సమయంలోనే ఇతని జాతకం చూసి ఫలానా సమయంలో ఇతనికి వివాహం అవుతుందంటూ ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు ఆ పండితుడు. కీరోకి ఆశ్చర్యం వేసింది. ఇతను అప్పటికే వివాహం చేసుకోకూడదని, బ్రహ్మచారిగానే ఉండిపోయి పెద్ద జ్యోతిష్కుడు అవాలని నిర్ణయం తీసేసుకున్నాడు. సరే చూద్దాం అనుకుని తిరిగి తనదేశానికి వెళ్ళిపోయాడు.
ఆ గురువుగారు చెప్పిన " వివాహసమయానికి " కొద్ది నెలలముందర ఇతనికి పెద్ద అనారోగ్యం చెయ్యడం, ఓ స్త్రీ ( నర్స్ అయి ఉండవచ్చు ) దగ్గరుండి శ్రద్ధగా సేవ చెయ్యడంతో అతను బ్రతికి బయటపడడం జరిగింది. ఆ స్త్రీ మీద అభిమానం, సాన్నిహిత్యం పెరిగి మనసుపడి ఆమెనే వివాహం చేసుకోవడం జరిగింది.
ఈయనకికాని, మేక్స్ ముల్లర్, హెచ్ హెచ్ విల్సన్ మొదలగు వారికి కాని భారతీయ సంస్కృతి మీద ఇంత అభిమానం, గౌరవం ఉండడానికి కారణం వారు అందరూ వారి క్రితం జన్మలో భారతీయులయి ఉంటారు.
ఎం వి వి ఎస్ మూర్తిగారు ( గీతం కాలేజి ) చూడండి. 80వ ఏట అమెరికాలోని పూర్వవిద్యార్ధులు సన్మానం చేస్తాం, రండి అని పిలవడం, ఈవయస్సులో అవసరమా అని అనుకోకుండా ఈయన " అమెరికా " వెళ్ళడం, నయాగరాఫాల్స్ లాంటివి చూద్దామనో ఏమిటో టూర్ వేసుకోవడం, కారుప్రమాదంలో మరణించడం చూస్తే " విధి " ని తప్పించలేరు ఎవ్వరూ అని అనిపించటంలేదూ. ఈయన తప్పకుండా మరుజన్మలో అమెరికాలో పుట్టవలసి ఉంది, అందుకే ఇవన్నీ జరిగాయి. పాతవాసనలు పోవు, మళ్ళీ ఆయన " విద్యారంగం " లోనే రాణిస్తారు. సంశయం నాస్తి.
అదీ మన సనాతనధర్మం విశిష్టత. పునర్జన్మ సిద్ధాంతాన్ని కాలక్షేపం కోసం చెప్పలేదు మన ఋషులు. ఋషుల విజ్ఞానం అనంతం, అద్వితీయం.
సర్వేజనాః సుఖినోభవంతు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment