భగవద్గీత 8:5 - కుక్కలు, పిల్లులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" అంతకాలే చ మామేవ

  స్మరన్ముక్త్వా కలేవరం

  యః ప్రయాతి స మద్భావం

  యాతి నాస్త్యత్ర సంశయః " 

                 - భ.గీత 8:5

" అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈవిషయమున ఎట్టి సందేహము లేదు " అన్నారు పరమాత్మ.

అది అంత సులభం కాదు. త్రిగుణాల ప్రభావంనుంచి తప్పించుకోవడం కష్టం. పరీక్షలు పెడుతూనే ఉంటారు పరమాత్మ.

" బ్రతికినన్నాళ్ళు నీ 

  భజన చేతును, 

  మరణసమయమున  

  మరతునేమో " 

అంటారు నరసింహశతక కర్త.

ప్రతీరోజూ దైవస్మరణ చేస్తూన్నా, మాయనుంచి తప్పించుకోలేరు. పోయే సమయంలో మనవణ్ణి " ఈరోజు శ్రీరామగాయత్రీజపం చేసావా, ఎంతచేసావు " అని అడగడు, వీధిలో కుక్క అరుస్తూంది చూడండ్రా అంటూ శరీరం విడుస్తాడు, మరుజన్మలో కుక్కగా పుడతాడు.

కుటుంబసభ్యుల దైనందిక అవసరాలు, వృద్ధుల అనారోగ్యసమస్యలతోనే కొంచెం కలవరం చెందుతూంటారు సాధారణంగా కుటుంబ యజమానులు. కాని ఆశ్చర్యంగా కొందరు కుక్కల్ని ( ఇప్పుడు పిల్లుల్ని కూడా ) పెంచుకుంటూంటారు. వాటిని బయటకు తీసుకుని వెళ్ళడం, స్నానం చేయించడం, తిండి తినిపించడం, వైద్యుడి దగ్గరకు తీసుకొని వెళ్ళడం కూడా శ్రద్ధగా చేస్తూంటారు. 

కుక్కలని పెంచుకోవడం ఆలనాపాలనా చూడటం ఏమాత్రం తప్పుకాదు. కాని వింత ఏమిటంటే వీరు ఆ కుక్కని తీసుకునిరారు. ఆ కుక్కే వీరి ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఈ కుక్క పూర్వజన్మలో వీరి కుటుంబసభ్యురాలు. ఋణానుబంధాన్ని తీర్చుకోవడానికి, సేవలు చేయించుకోవడానికి వీరి దగ్గరకు చేరుతుంది.

బంధం ఎక్కువగానూ తేల్చుకోవలసిన లెక్కలు బట్టి ఆవులు, గేదెలు, గుర్రాలు, కుక్కలు, పిల్లుల రూపంలో ఆ ఆ ఇంటికి చేరుతూంటారు.

అమ్మవారి సృష్టి ఏర్పాట్లు ఎంత అద్భుతంగా ఉంటాయో.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ