సనాతనధర్మం భవిష్యత్తు - సంస్కృతి సంస్కృతం 5 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏

" సంస్కృతి - సంస్కృతం 5 "

మా గ్రామవాసి, బంధువు అయిన " పండితరాజ " జగన్నాధపండితులు తన 25వ ఏటే కాశీవిశ్వవిద్యాలయానికి ముఖ్యాధిపతి అయేరు. ఆయన 16వ ఏటకే వేదశాస్త్రాల్లో దిట్ట, ఎందరో పండితులను శాస్త్రవిజ్ఞానంతో ఓడించి ఆ పదవి చేపట్టడం జరిగింది. 

ఆకాలంలో బాదుషా వారి ఆస్థానంలో ఉండే మౌల్వీలు హిందువులగురించి కొంచెం కించపరిచే విధంగా మాట్లాడేవారు. ముఖ్యంగా 2 విషయాలు బాధించేవి. ఒకటి సంస్కృతం కూడా అరబ్బీనుంచే పుట్టిందని, రెండవది హిందూ పురాణాలే చెబుతున్నాయి " పరశురాముడు 21సార్లు దండయాత్ర చేసి రాజుల్నందరినీ చంపేసాడు " అని, కనుక దేశంలో అప్పుడున్న రాజులందరూ " నకిలీలే " అనీనూ.

రాజస్తానీయ " జయపుర " పాలకుడైన మొదటి శ్రీసవాయీ జయసింహ మహారాజు ఈయన్ని కలిసి విషయం చెప్పి " చాలా బాధగా ఉంది, నేను ధనసహాయం చేస్తాను, తమరు ఆజ్మీర్ వెళ్ళి వారి భాషలు అరబ్బీ, పార్శీ, ఉర్దూలను నేర్చుకుని వారిభాషలోనే వారికి సరైన సమాధానం చెప్పి మా ఈ బాధను తొలగించాలి " అని అడగడంతో ఈయన ఆ భాషలలో పాండిత్యం సంపాదించి వచ్చి, మహారాజు పలుకుబడితో ఓ రోజు బాదుషా ( బా ) కొలువుకు వెళ్ళారు జగన్నాధపండితులు ( జగ ). బాదుషా ఈయన వాలకం చూసి కొంచెం వేళాకోళంగా మాట్లాడేడు. వారి సంభాషణ ఇలా జరిగింది:

బా: మీ యజ్ఞోపవీతం అంత  

      నల్లగా ఉందేమిటి

జగ: మసి అంటుకుంది

బా:  మసా, ఎలా

జగ: స్నానం చెయ్యడం వలన

బా:  స్నానం చేస్తే మసి 

       అంటుకుంటుందా?

జగ: నీళ్ళు నల్లగా ఉన్నాయి 

       కనుక

బా:  నదిలో నీళ్ళు నల్లగా 

       ఉండడమేమిటి

జగ: యమునా నదిలో నీళ్ళు 

       నల్లగా ఉన్నాయి 

బా:  ఆశ్చర్యంగా ఉంది, 

       అర్ధమవలేదు

జగ: మీరు ఒక్కొక్క రాజ్యాన్ని 

       జయిస్తూ పోతూంటే   

       చనిపోయిన సైనికుల 

       భార్యలు రేయింబవళ్ళు 

       దుఃఖిస్తూ ఉండడం వల్ల  

       వారి కాటుకకన్నుల 

       నుండి కారిన కన్నీరు 

       పొంగిపొరలి వచ్చి  

       యమునలో కలవడంతో 

       దాని నీరు ( కాటుకతో ) 

       నల్లగా అయిపోయింది.     

      ( బాదుషా పరాక్రమాన్ని 

      వర్ణిస్తూన్నట్లుగా 

 ‌     స్త్రీలకన్నీటితో అలా 

      చమత్కారంగా 

      చెప్పారు ).

బా: " అద్భుతం, ఎంతటి 

      చమత్కారం ( బాదుషాకు 

      అలా అనిపించింది ), 

      మీరాకకు కారణం ".

అలా చమత్కార సంభాషణతో బాదుషాను మెప్పించి మీ మౌల్వీలతో వాదనకు వచ్చాననడం, ఆయన సరే అనడం, వీరు వాదనతో మౌల్వీలను ఓడించడం, బాదుషా కోరికపై ఆయన కొలువులో ఆస్థానపండితుడుగా చేరి " పండితరాజ " బిరుదును పొంది ముఖ్యవిద్వాంసుడు పదవిని అలంకరించడం జరిగింది. న్యాయసభకు కూడా ఈయన అధిపతిగా ఉండేవారు. బాదుషా అర్ధసింహసనాన్ని అధిష్టించడం కూడా జరిగింది.

బాదుషా కూతురు, బావమరిది కూడా ఈయన శిష్యులుగా అయినట్లు తెలుస్తూంది. 

తెలుగునేలలోని ఓ కుగ్రామం నుంచి వెళ్ళి పరాయిపాలకుల సంస్థానంలో అటువంటి ఉన్నతపదవిని అధిరోహించాలంటే ఎటువంటి విద్వత్తును కలిగి ఉండాలి.

అప్పటి పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చి హిందువుల జీవితాలను కొంతవరకూ సుఖమయం చేసారని తెలుస్తూంది.

" యదా యదాహి ధర్మస్య......( భ.గీత )" - ధర్మానికి హాని జరుగుతూన్నప్పుడు పరమాత్మ రారు, ఇటువంటి వారిని పంపిస్తూ ఉంటారు.

ఎందరో మహానుభావుల కష్టఫలితం కారణంగానే నేటికీ సనాతనధర్మం నిత్యనూతనంగా శోభిల్లుతోంది.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య 

శుభం భూయాత్

( పండితరాయల విద్వత్తు/రచనలు గురించి తొందరలో చదువుకుందాం )

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ