ఋషి వ్యవస్థ - సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" ఋషి " అంటే అతీంద్రియమయిన జ్ఞానాన్ని దర్శించినవారు. ఈశ్వర సంకల్పాన్ని లోకాలకు అందించే అద్భుత వ్యవస్థ. శాస్త్రజ్ఞులు కూడా ఋషులే.
గెడ్డంపెంచుకుని ముక్కుమూసుకుని ఓమూల కూర్చుని ఉంటారు అని సామాన్యుల భావన. సినీమాలు మనల్ని అలా అనుకునేలా చేసాయి. వారు కారణజన్ములు. వారు ఏది చేసినా లోకకళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకునే.
అటువంటివారు జీవించేది లోకకళ్యాణంకోసం.
రామాయణంలో 27 రకాల ఋషుల వివరణ ఉంది. 27 ఋషులుకాదు, 27 రకాల ఋషులు. కొందరు నీరునుమాత్రమే, కొందరు గాలినిమాత్రమే, కొందరు గాలిలో తేలుతూ, కొందరు సూర్యరశ్మినే అహారంగా తీసుకుంటూ ఇలా అనేక ఋషులు లోకకల్యాణం కోసం తపస్సు చేస్తున్నారు అని తెలియచేసారు.
రామాయణంలో మతంగ మహర్షిని గురువుగా పొందగలిగింది శబరి. మహర్షి కుమారుడే మాతంగ మహర్షి, తపస్సు చేసి శ్యామలాదేవిని కూతురి ( మాతంగి ) గా పొందారు. మతంగ మహర్షి శబరితో " నేను వచ్చినపని అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, త్వరలో రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారు, వారిని సేవించుకుని తరించు " అని చెబుతారు. వస్తున్నారని తెలిసినా రామలక్ష్మణులకోసం ఆగలేదు మహర్షి. ఆ మహర్షికి అమ్మవారు అప్పగించిన పని అయిపోయింది అని అర్ధం.
మన ఋషుల విద్వత్తు గురించి మన సనాతనధర్మం విశిష్టత గురించి అర్థం చేసుకోవడానికి ఇతర దేశస్థులకు కనీసం ఇంకో పదివేల సంవత్సరాలు పడుతుంది.
మన సనాతనధర్మానికి సాటిలేదు, భవిష్యత్తులో రాబోదు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment