జర్మనీ దేశగురువు మనశాస్త్రిగారే - సంస్కృతి సంస్కృతం - 7 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 

" సంస్కృతి - సంస్కృతం 7 "

1970 లలో జర్మనీలో ఒకాయన మన రాయబారిగా ఉండేవారు.‌ " ఫ్రాంక్ ఫర్ట్ " విశ్వవిద్యాలయం వారు ఈయన్ని ముఖ్య అతిథిగా ఓ కార్యక్రమానికి పిలిచారు. ఈయనకు అక్కడ సిబ్బంది అన్ని విభాగాలూ చూపించి చివరకు విశ్వవిద్యాలయం లోని " సెంట్రల్ హాల్ " కి తీసుకునివెళ్ళారు. విదేశీప్రముఖులు అక్కడే కూర్చుంటారు.

ఈయన లోపలికి వెళ్ళగానే ఎదురుకుండా గోడకి ఓ పెద్ద ఆయిల్ పెయింటింగ్ చూసారు. పంచె లాల్చీ కట్టుకుని నుదుట విభూతి కుంకుం పెట్టుకుని పిలకతో ఉన్న ఒకాయనది ఆ చిత్రం. ఈయన ఆశ్చర్యపోయి " ఎవరు ఈయన " అంటే అధికారులు " ఈయన తెలియదా, మీ భారతీయుడే, మా దేశగురువు " అన్నారు.

వెంటనే రాయబారి ఈ విషయాలన్నీ తెలియచేస్తూ ఓ నోట్ ని మన ప్రధానమంత్రికి పంపించారు. ఆవిడ ఆశ్చర్యపోయి వివరాలు సేకరించమని గూఢచారులకి ఇచ్చారు.

ఆ జర్మనీ దేశగురువే మన శ్రీదండిభట్ల విశ్వనాధశాస్త్రి గారు. 15వ ఏటకే యజు అధర్వణ వేదాలు, వ్యాకరణం, తర్కశాస్త్రాలలో దిట్ట. ఆయనది రాజమండ్రి అంటారు కాని మా అమ్మగారూ వాళ్ళు నా చిన్నప్పుడు మాట్లాడుకునేది తణుకు దగ్గర ఒక గ్రామం.

హిట్లర్ యుద్ధపిపాసి. ఆధునిక ఆయుధాలు తయారు చెయ్యాలని ఆకాంక్ష. వేదాలలో ఈ విజ్ఞానం అంతా ఉందని విని 1930ల నుంచే తన మనుషులను భారత్ కు, టిబెట్ కు పంపించారుట - వేదవిజ్ఞానం దిట్టలను వెతికి పట్టుకుని తీసుకురావడానికి.

6,7 సం.లు వెతగ్గా వారికి ఈ శాస్త్రిగారు సరైనాయన అని అనిపించిందిట. శాస్త్రిగారి భార్యకు చాలా ఎక్కువ మొత్తంలో బంగారాన్ని ఇచ్చి, మళ్ళీ తొందరలో తీసుకుని వచ్చి అప్పచెబుతామని మాటిచ్చి, ఆయన భార్యను తల్లిదండ్రులని ఒప్పించి తీసుకుని పోయారుట ( ఇవన్నీ నెట్ లో చదవవచ్చు ). 

ఈయన వెళ్ళాకే ప్రపంచంలో మొట్టమొదటి " పల్స్ జెట్ " విమానాన్ని తయారు చేసింది జర్మనీ. అది తప్పా ఒప్పా అని ఆలోచించనక్కరలేదు. అందరూ పరమాత్మ ( కాలో2స్మి అన్నారు స్వామి - భ.గీత 11:32 ) ఆడించే నాటకంలో పాత్రధారులే.

వేదవిజ్ఞానాన్ని, శాస్త్రిగారిని గౌరవించుకోవడంవల్లే విదేశీకుట్రలతో దేశం రెండుగా విడిపోయినా మళ్ళీ " కలిసిపోవాలనే " ఆలోచన వచ్చింది వారికి, కలిసిపోయారు. అదీ మన సంస్కృతి " నమ్మినవారికి " ఇచ్చేది. మనకు నమ్మకం తక్కువ కనుక రాష్ట్రాలనీ, జిల్లాలని, గ్రామాలనీ విడగొట్టుకుంటున్నాం.

చైనా టిబెట్ ని ఆక్రమించుకున్నాక వారికి లాసాలో కొన్ని తాళపత్రగ్రంధాలు దొరికాయి. వాటిని ఛండీఘర్ లోని సంస్కృతవిశ్వవిద్యాలయానికి పంపించి డీకోడ్ చేసి ఇవ్వమన్నారు. వీరికి మతిపోయింది - వాటిలో ఇతరగ్రహాలకు ఎలా వెళ్ళాలి, స్పేస్ షిప్పులు ఎలా తయారుచేసుకోవాలి, ఆ షిప్పుల డిజైన్లు అన్నీ ఉన్నాయిట ఆ తాళపత్రాలలో.

మిలార్డ్ అనే అమెరికా శాస్త్రజ్ఞుడు స్వయంగా చెప్పినది " అమెరికా గ్రంధాలయాల్లో 3700 సంస్కృతగ్రంధాలు ఉన్నాయి " అని. 

రసగుల్లాలు బొబ్బట్లు బూర్లు అప్పుడప్పుడు తింటూన్నట్లే ఇటువంటి విషయాల గురించి కూడా అప్పుడప్పుడు గుర్తుచేసుకుంటే " మనదేశ గతం ఎంత ఘనమో " తెలుస్తుంది, మనకు స్పూర్తినిస్తుంది, నిస్పృహనుంచి బయటపడేస్తుంది. " క్లైబ్యం మా స్మ గమః ( భ.గీత 2:3 ) " - " నపుంసకత్వాన్ని విడనాడు ముందు " అన్నారు పరమాత్మ అర్జునుడితో.

ఇలాంటి విషయాలన్నీ " వేదవిజ్ఞానం గొప్పదనం " లో 0.1% కన్నా తక్కువ - సూర్య. 

హమారా సనాతనధర్మ మహాన్.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ