ఉతకనక్కరలేని బట్టలు రామాయణకాలంలోనే - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏
ఋషివ్యవస్థ అంటే " ఈశ్వరుడి సంకల్పాన్ని భూమిమీద ప్రవర్తింపచేసే వ్యవస్థ " అని చెబుతూంది సనాతనధర్మం. ఏ ఋషి కృషి పరిశీలించినా ఇది సత్యమని తెలుస్తుంది.
మహర్షి వాల్మీకి విరచిత రామాయణం ఎంతటి అద్భుతగ్రంధం. చదివేకొద్దీ వింతవింత విషయాలు తెలుస్తూనే ఉంటాయి.
సీతారామలక్ష్మణులు చిత్రకూటానికి వెడుతూ అత్రిమహర్షి ఆశ్రమానికి వెడతారు. అనసూయ ఎంతో ఆనందించి " నీమాటలు, చేసినపని ( రాజభోగాలు వద్దనుకుని వనవాసానికి రావడం ) నాకు మిక్కిలి సంతోషం కలిగించాయి, నీకు ఏదయినా ఇవ్వాలని ఉంది, ఏమి కావాలో కోరుకో " అంటుంది. సీతమ్మ " మీ అశీస్సులు చాలు " అంటే అలాకాదు అని పువ్వులు, చీర ఇస్తూ అంటుంది " ఎప్పటికీ ఈ పువ్వులు వాడవు, ఈ చీర మాయదు " అని. " మాయదు " అంటే అస్తమానూ ఉతుక్కుని ఆరబెట్టునోనక్కరలేదు అని. ఎంత అద్భుత విషయం. అన్నాళ్ళు అశోకవనంలో ఒకే చీరతో " సీతమ్మ ఎలా గడిపింది " అనే ప్రశ్నకు సమాధానం ఈ విషయం.
రావణుడు సీతమ్మని ఎత్తుకుపోవడానికి సహాయం చెయ్యమని అడగడానికి మారీచుడి ఆశ్రమానికి వస్తాడు. రాముడి దెబ్బకు తత్వం బోధపడి తపస్సు చేసుకుంటూ గడుపుతున్నాడు మారీచుడు. ఎంతనచ్చచెప్పినా రావణుడు కుదరదంటే " సరే " అని సహాయం చెయ్యడానికి ఒప్పుకుంటాడు.
రావణుడు రధం ఎక్కమంటాడు మారీచుడిని. " ఇద్దరూ ఎక్కగానే రధం ఆకాశంలోకి లేచి నదులను, పర్వతాలను, నగరాలను, గ్రామాలను, అరణ్యాలను దాటుకుని పంచవటి చేరుకుంది " అని తెలియచేసారు మహర్షి. ఎంత అద్భుతవిషయం. అది " హెలికాప్టర్ " అని తెలుస్తూనే ఉంది.
అదీ మన " అద్భుతవిజ్ఞానస్థాయి " వేల సం.ల క్రితమే. అంతటి ఉన్నతస్థాయి నుంచి " ఎటువంటి " స్థాయికి దిగజారిపోయేలా చేసారు/చేస్తున్నారు కొందరు పనిగట్టుకుని. మళ్ళీ తొందరలో పూర్వపుస్థాయికి చేరుకుంటామని ఆశిద్దాం, దానికోసం కృషి చేద్దాం.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏🙏🙏
ReplyDelete