" బాలరాముడి " విగ్రహమునే ఎందుకు ప్రతిష్టించాలి అయోధ్యలో - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
కొన్ని రోజులుగా ప్రముఖంగా వినిపిస్తూన్న విషయం అయోధ్యలో ఈనెల 22న " బాలరామ " విగ్రహ ప్రతిష్ట.
కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొందరికి " బాలరాముడు " ఎందుకండీ, రాముడి విగ్రహం పెట్టవచ్చుకదా అని. అలా ఆశ్చర్యపోవడంలో ఏమాత్రం తప్పులేదు.
మొదటగా చూడవలసినది రామజన్మభూమి. రాముడు అక్కడ పుట్టాడు. ఎక్కడ?. అయోధ్యలో కాదు, అయోధ్యలోని ఓ ప్రత్యేక స్థలంలో. ఆ స్థలంలో ఉన్న వేరే కట్టడాన్ని తీసేయాలని, అక్కడ రాముడి గుడి కట్టాలి అని 500 సం.రాలుగా ఉన్న వివాదం. అత్యున్నత న్యాయస్థానం కూడా " అక్కడే ఎందుకు కట్టాలి " అని అడగడం దానికి కావలసిన ఋజువులు సమర్పించడం జరిగింది. ఆ స్థలమే రామజన్మ ( పుట్టిన ) స్థలం అని న్యాయస్థానం నిర్ధారించింది.
ఇప్పుడు ఏ విగ్రహం పెట్టాలి అన్నది చూద్దాం. రాముడి గుడి అనగానే మనకు రాముడు, ఎడమప్రక్క సీతమ్మ, కుడిప్రక్క లక్ష్మణుడు, క్రింద ఎదురుగా హనుమ దర్శనమిస్తారు. ఇంకా వీలయితే ఇటూ అటూ భరతశతృఘ్నులు, శివుడు, బ్రహ్మ, నారదులు, వశిష్టులు ఇలా ఎందరో ఉండవచ్చు. ఇన్ని విగ్రహలు పెడితే ప్రత్యేకత ఏముంటుంది.
పైగా అది రాముడు జన్మించిన చోటు. అక్కడ రాముడి పుట్టుకే ప్రత్యేకత, ఒక్క రాముడే ప్రత్యేకమయినవారు.
అందుకని బాలరామవిగ్రహం ప్రతిష్టిస్తే ఆ ప్రత్యేకత కనబడుతుంది/తెలుస్తుంది. చూపు, మనస్సు ఆయనమీదే నిలచి మనస్సు ప్రశాంతతను పొందుతుంది. జన్మ ధన్యమవుతుంది.
ముఖ్యంగా 500 సం.ల క్రితం ఆ ప్రదేశంలో " బాలరాముడి " విగ్రహమే ఉండేది కనుక బాలరాముడి విగ్రహప్రతిష్టే ప్రాముఖ్యతను సంతరించుకుంది.
అందుకే " బాలరామ " విగ్రహ ప్రతిష్ట.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయత్
Comments
Post a Comment