జీవహింసతప్పు అని రామాయణంకాలంలోనే చెప్పారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
రామాయణం చదివేకొలదీ అద్భుతాలు తెలుస్తూంటాయి.
విరాధుడిని చంపిన తరువాత సీతారామలక్ష్మణులు శరభంగమహర్షి ఆశ్రమంకి చేరుకుంటారు. ఆయన అర్ఘ్యపాదులు ఇచ్చి " మీ విషయాలన్నీ తెలుస్తున్నాయి, నా తపోఫలమంతా నీకు ధారపోస్తున్నాను, నేను వచ్చిన పని అయిపోయింది, ఇకనేను అగ్నిప్రవేశం చేస్తాను. మీరు ఇక్కడకి దగ్గరలో ఉన్న సుతీక్షణమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకోండి " అని చెబుతారు మహర్షి రాముడితో.
ఆయనకు పాదాభివందనం చేసి ఆయన అగ్నిప్రవేశం చేసాక తిన్నగా సుతీక్షణమహర్షి ఆశ్రమానికి వెడతారు.
మహర్షి వీరిని చూసి ఎంతో ఆనందపడతారు. " మీ కార్యక్రమాలన్నీ నిరాటంకంగా సాగుతున్నాయా " అని అడిగిన రాముడితో " కొన్ని మృగాలు అప్పుడప్పుడు వచ్చి కొంచెం అసౌకర్యాన్ని కలిగిస్తాయి కాని అవేమీ అంత క్రూరమయినవి కావు సుమా " అంటారు మహర్షి.
అప్పుడు రాముడు అంటాడు " మీ అభిమతం అర్ధమయింది, మీకు మృగాలను వేటాడడం, చంపడం ఇష్టంలేనట్లుగా తెలుస్తూంది " అని.
ఎంతటి అద్భుతమయిన విషయం. మన ఋషివ్యవస్థకు సాటి అయినది ప్రపంచంలో ఎక్కడా ఉండదు, రాబోదు.
ఇప్పుడు అంతా జంతుసంరక్షణ, జీవహింసవద్దు అంటూ కొత్తగా మనకు తెలియనట్లు చెబుతున్నారు కాని వేల సంవత్సరాల క్రితమే మహర్షి మృగాలను " అనవసరంగా " చంపకూడదని రామాయణ కాలంలోనే తెలియచేసారు.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment