" రాముడు లేని అయోధ్య శ్మశానం "- వశిష్టులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 

" న హి తద్భవితా రాష్ట్రం 

  యత్ర రామో న భూపతిః, 

  తద్వనం భవితా రాష్ట్రం 

  యత్ర రామో నివత్స్యతి "

" రాముడు లేని అయోధ్య అడవి, రాముడు ఉన్న అడవే అయోధ్య " అంటారు వశిష్టులు కైకేయితో.

వశిష్టమహర్షి కైకేయితో " సీత నారచీర కట్టదు, రాజ్యాన్ని పాలిస్తుంది. ఒకవేళ అడవికి వెళ్ళినా పట్టుచీర ధరించి, ఆభరణాలు పెట్టుకునే వెడుతుంది " అన్నాక ఊరుకోలేదు. 

రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అని చెబుతూ " కైకేయీ - భరతుడు ఇక్కడలేడు కనుక నీ కోరిక తీర్చుకున్నావు. కాని భరతుడు రాజ్యాన్ని పాలిస్తాడనుకున్నావా. ప్రజలే కాదు పశుపక్ష్యాదులు కూడా రాముడి వెంట వెళ్ళిపోతాయి. కదలలేని చెట్లు, వాటి కొమ్మలు రాముడు వెళ్ళినవేపు సాగి మమ్మల్ని కదలలేని వాటినిగా ఎందుకు పుట్టించావు భగవంతుడా అని విలపిస్తూ ప్రాణాలు కోల్పోతాయి. అప్పుడు శ్మశానమయిన అయోధ్యలో నువ్వు, నీ కోడుకే ఉంటారు " అంటారు.

బ్రహ్మర్షి నోటివెంట వచ్చిన మాటలు అలాగే నిజమయాయి. భరతుడు రాజ్యం వద్దన్నాడు. అడవికి వెళ్ళి రాముడి కాళ్ళపైపడి అయోధ్యకు తిరిగి రమ్మని వేడుకున్నాడు. రాముడు వనవాసానికి వెళ్ళడానికి, అయోధ్య అనాధగా అవడానికి కారణం తన తల్లియేనని నిందించాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాముడి పాదుకలే అయోధ్యను పాలిస్తాయని రామునితో చెప్పి పాదుకలను తీసుకుని అయోధ్యకు వస్తాడు. వచ్చాక " అయ్యో రాముడి లేని అయోధ్యలో ఎలా ఉండేది " అని విలపిస్తూ అక్కడ ఉండలేక కొద్దిదూరంలో ఉన్న " నందిగ్రామం " అనే ఊరిలో పాదుకలను ఉంచి అక్కడనుంచే పాలన సాగిస్తాడు. ఋషిప్రోక్తం అంటే అదే. మహర్షి చెప్పినట్లుగానే రాముడు లేని అయోధ్య అనాధ అయింది.

శ్రీరామపాదుకా పట్టాభిషేకం కూడా నందిగ్రామంలో జరిగింది, అయోధ్యలో కాదు.

" అంతా రామమయం

  జగమంతా రామమయం " 

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ