మహాసముద్రం - చిల్లపెంకులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

వైదికవిజ్ఞానం, మహాభారతం, రామాయణం మొ.గునవి మహాసముద్రాలు. శ్రద్ధగా లోపలికి వెళ్ళేకొలదీ ముత్యాలు అపురూపమైన శంఖాలు లాంటి విలువైనవి దొరుకుతాయి. ఒడ్డున కూర్చుని చూస్తూంటే ఏమి ఒరుగుతుంది, గుల్లలు ఏరుకోవడం జరుగుతుంది తప్ప. మన సంస్కృతి/విజ్ఞానం గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడేది ఒడ్డునకూర్చుని సంపాదించిన " మిడిమిడిజ్ఞానం " తోనే. 

జీవితాంతం కష్టపడితే ఒక వేదంలో మహా అయితే పదవవంతు అర్ధంచేసుకోగలరు. సామవేదం వంటివారే " నాకు తెలిసినంతవరకూ " అని చెబుతూంటారు.

భరద్వాజ మహర్షి వేదపారంగతుడు. ఓ సారి ఆయన వేదపఠనం చేస్తూంటే ఇంద్రుడు వచ్చి ఎంతవరకూ వచ్చింది మీ పఠనం అంటే మహర్షి ఈ జన్మ సరిపోదు అనడంతో ఇంద్రుడు మహర్షికి ఇంకో 300 సం.ల వయస్సు ఇచ్చాడు. అలా 3 సార్లు అంటే 900 సం.ల వయస్సు ప్రసాదించి మళ్ళీవచ్చి అయిందా అంటే మహర్షి పర్వతాన్ని చూపెట్టి వేదం ఆ పర్వతం అయితే నేను నేర్చుకున్నది ఇది అని " గుప్పెడు ఇసుక " తీసి చూపించారు మహర్షి. " అనంతావై వేదాః " అన్నారు అందుకే. 

పదాల అర్ధం గ్రహించడమే కష్టం. ఒక్కో పదానికి ఎన్నో అర్ధాలు. వేదంలో " తస్య ప్రతిమ నాస్తి " అని ఉందిట. శారదాపీఠం ఉత్తరపీఠాధిపతి అనుగ్రహభాషణం చేస్తూ " ఈ వాక్యం చదివి మీ దేముడికి విగ్రహం లేదని మీ వేదంలోనే ఉందికదా అంటూంటారు కొందరు. కాని ప్రతిమ అంటే విగ్రహం కాదు, పోలిక. అంటే పరమేశ్వరుడితో పోల్చదగినవాడు లేడు అని అర్ధం " అని తెలియచేసారు. 

ఎంత అద్భుతం మన వేద వాజ్మయం.

అమెరికా పండితుడు " మీనార్డ్ " మన దేశానికి వచ్చినప్పుడు అమెరికా గ్రంధాలయాల్లో 6700 సంస్కృతలిఖితగ్రంధాలు ఉన్నాయని తెలియచేసారు. మన ఋషులు వ్రాసిపెట్టారు. మనల్ని చదవనివ్వలేదు, వారు మన ఋషుల గ్రంధాలు చదివి " ఆ విషయాలనే " ప్రపంచానికి ఇప్పుడు తెలియచేస్తున్నారు. 

మన అద్భుత గురుకులసంప్రదాయాన్ని, విజ్ఞానాన్ని, సనాతధర్మప్రాభవాన్ని అత్యంత చాకచక్యంగా తగులబెట్టిన " లార్డ్ మెకాలే ( 1935 ) " కి ఇంకోసారి జిందాబాద్ చెబుదాం. 

తెలిసో తెలియకో ఓ అప్రాచ్యుడు ( ఇది తిట్టుకాదు ) నాటకంలో తనపాత్రధారిచేత " అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష " అని పలికించాడు. నిజంగా వేదంలో లేనిది ఏముంది.

అలాగే జ్యోతిషం అంటే వెలుగు. ఎంత లోతయిన శాస్త్రం. దానిలో నిష్ణాతులు అవాలంటే ఎంత సాధన చేయాలి. అరకొర జ్ఞానంతో చెప్పినవి జరగలేదంటే తప్పు శాస్త్రానిది కాదు.

శాస్త్రం అంటే మన ఋషులు వారి జ్ఞాననేత్రంతో చూసి, అర్ధంచేసుకుని, అనుభవించి మన ఉన్నతికోసం ఇచ్చిన సంపద. మన సనాతనధర్మానికి సాటి అయినది లేదు, రాదు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ