శ్రీరాముడు భారతదేశంలో నిజంగా తిరిగాడా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" అందాల రాముడు 

  ఎందువలన దేముడు ".

వేల సంవత్సరాలుగా హిందువుల జీవితాలలో భాగమయిపోయిన శ్రీరాముడు నిజంగా ఈ నేలమీద నడయాడా అని మన హిందువులలో కొంతమందికి కూడా ఇంకా అనుమానమే.

వాల్మీకిమహర్షి చేసిన అద్భుతమైన విషయమేమిటంటే శ్రీరాముడు నడయాడిన ప్రదేశాలలో ఉండే జంతువులు, వృక్షాలు, పక్షుల గురించి ఎంతో వివరంగా వర్ణనలు చేసారు రామాయణంలో. రామాయణం గురించి జరిగిన పరిశోధనలలో ఈవిషయాలు ఎంతో ఉపయోగపడ్డాయి పరిశోధకులకు.

చెన్నై కి చెందిన అమృతలింగం, సుధాకర్ అనే వృక్షశాస్త్రజ్ఞులు 3 సం.లు కష్టపడి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. వాల్మీకి రాముడు నడయాడిన ప్రదేశాల్లో ఉన్నట్లుగా వ్రాసిన వృక్షాలు, మొక్కలు, జంతువుల గురించి విస్తృత పరిశోధనలు చేసారు వీరు. ఆ ఆ ప్రదేశాలకు వీరు స్వయంగా వెళ్ళి చూసి ఆవిషయాలను నిర్ధారించుకున్నారు. వీరు శ్రీలంకకు కూడా వెళ్ళి అశోకవృక్షాలను చూసి వచ్చారు. వాల్మీకిమహర్షి వ్రాసిన విషయాలు, ఈ శాస్త్రజ్ఞులు కనుగొన్న విషయాలు సరిగ్గా సరిపోయాయి.

అద్భుతమయిన విషయమేమిటంటే వాల్మీకి దండకారణ్యంలో పులులు, సింహాలగురించి వ్రాసారు రామాయణంలో. కాని అక్కడ సింహాలు ఉన్నట్లు చరిత్రలో లేదు. మరెలా వాటిగురించి వ్రాసారు వాల్మీకి? 

దండకారణ్యంలో విస్తృతంగా ప్రయాణించి శోధిస్తే వీరికి కొన్ని గుహల్లో గోడలమీద చెక్కిన సింహాల బొమ్మలు కనబడ్డాయి. ఆ ప్రాంతంలో సింహాలు ఉండి ఉండకపోతే వాటి బొమ్మలు ఎలా వస్తాయి. అంటే అక్కడ సింహాలు పూర్వం ఉండి తరువాత అంతరించి ఉంటాయి అని తెలుస్తూంది.

ఇంకా ఋజువులు దేనికి రాముడు ఈ భూమిపై నడయాడాడని బల్లగుద్ది చెప్పడానికి.

" అంతా రామమయం

  జగమంతా రామమయం "

" అందాలరాముడు 

  అందువలన దేముడు ".

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ