శ్రీరాముడి న్యాయవాది పరాశరన్ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" అంతా రామమయం
జగమంతా రామమయం "
రామజన్మభూమి వివాదాన్ని సుప్రీం కోర్టులో వాదించినాయన శ్రీ కేశవ పరాశరన్. ఈయన ప్రస్తుత వయస్సు 96 సం.లు.
వాదనలు జరుగుతూండగా జడ్జిగారు ఈయన చెప్పులు కూడా వదిలేసి నుంచుని మాట్లాడుతూండడం చూసి " మీరు పెద్దవారు, కూర్చుని మాట్లాడవచ్చు, మీరు చెప్పెవన్నీ మేము వింటాం " అంటే ఈయన అన్నారు " ఎందరో క్లయంట్స్ కి నేను నుంచునే మాట్లాడాను. ఇప్పుడు నా క్లయంట్ భగవద్స్వరూపుడయిన మా రామయ్యతండ్రి. నేను ఆయన తరపున కూర్చుని ఎలా మాట్లాడుతాను " అనడంతో జడ్జిగారు ఆశ్చర్యపోవడం జరిగింది.
మొట్టమొదటగా రాముడిని బయటకు తీసుకుని వెళ్ళిన విశ్వామిత్రుడు రాముడికి అనుగ్రహించినది " బల అతిబల " మంత్రాలు. ఈ మంత్రపారాయణ అలసట అనేది లేకుండా చేస్తుంది. నిద్ర ఆహారాలు లేకపోయినా, ఎంత శ్రమపడినా ఉత్సాహం తగ్గదు.
తరువాత విశ్వామిత్రులవారు ఇచ్చిన అస్త్రశస్త్రాలన్నీ రాముడు లక్ష్మణుడికి ఇస్తూంటాడు.
రామనామం జపించిన భక్తులకు రామచంద్రుడు ఈ " బల అతిబల " మంత్రశక్తిని ప్రసాదిస్తాడు. అందుకే రామభక్తులకి అలసట ఉండదు.
90 వయస్సులో కోర్టులో గంటల తరబడి చెప్పులయినా వేసుకోకుండా నిలబడి వాదనలు చేసి రామజన్మభూమి కేసుని నెగ్గించారంటే పరాశరన్ గారి మానసిక శారీరక దృఢత్వానికి వెనుక రాముడు ప్రసాదించిన " బల అతిబల " మంత్రశక్తి బలమే. సంశయం అక్కరలేదు.
రామ అని ఆర్తిగా పిలిస్తే చాలు ఆయన అనుగ్రహించనిది ఉండదు. అందుకే ఏమీ తెలియని చంటిపిల్లలకు " శ్రీరామరక్ష వెయ్యేళ్ళ ఆయుష్షు " అని నీళ్ళు చుట్టూ త్రిప్పుతారు.
" శ్రీరామరక్ష సర్వజగద్రక్ష "
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయత్
Comments
Post a Comment