మనస్సు - కోతిచేష్టలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

ఒకరోజు కంచి పరమాచార్యులవద్దకు ఓ భక్తుడు వచ్చాడు. దైవభక్తి మెండుగా ఉన్నవాడు, పరమాచార్యులంటే భక్తి గౌరవం ఉన్నవాడు.

భక్తుడు అన్నాడు " స్వామీ ఎప్పుడు కళ్ళుమూసుకుని అమ్మవారిని తలచుకున్నా ఓ ప్రముఖ ' నటి ' మొహం గుర్తుకొస్తూంది, ఏమి చెయ్యడం " అని.

స్వామి అన్నారు " మొహం ఎందుకు గుర్తుచేసుకోవడం, నువ్వు పట్టుకోవలసినవి, కోరుకోవలసినవి అమ్మవారి పాదాలు, అందుకని పాదాలు గుర్తుచేసుకో " అని.

అమ్మవారి పాదాలు అగ్నివర్ణంలో ఉంటాయి. పసుపువ్రాసి, పారాణి అలంకరించి ఉంటాయి. ఆ ఊహే అద్భుతం.

శంకరులు శివానందలహరి చేస్తూ ఇలా అంటారు :

" సదా మోహాటవ్యాం చరతి 

  యువతీనాం కుచగిరౌ, 

  నటత్యాశాశాఖా స్వటతి 

  ఝడితి స్వైర మఖికః,

  కపాలిన్ భిక్షో మే     

  హృదయకపి 

  మత్యంత చపలం , 

  ధృఢం భక్త్వా బద్ధ్వా శివ 

  భవదధీనం కురు విభో " .

" ఓ ఈశ్వరా - నా హృదయం ( మనస్సు ) మోహం అనే అడవిలో తిరుగుతూంది. నా మాట వినడం లేదు. అతి చపలమైన నా మనస్సనే కోతిని దయచేసి నా భక్తి ( అనే తాడు ) తో కట్టి నీ అధీనంలో ఉంచుకో స్వామీ " అని.

ఇక సామాన్యమానవుల గురించి చెప్పాలా. అందుకే గీతలో స్వామి చక్కటి మార్గాన్ని సూచించారు. నాసికాగ్రాన్ని చూడమంటే రెండు కళ్ళతో అని కాదు. కళ్ళుమూసుకుని అంతర్దృష్టిని ఎవరి ముక్కుచివరన వారిని నిలుపమని. 

అప్పుడు మనస్సు కొంచెం కుదురుకుంటుంది.

ఈరోజు శ్రీకంచిపరమాచార్యుల ఆరాధనోత్సవం. కారణజన్ములు.

" అపారకరుణా సింధుం 

  జ్ఞానదం శాంతరూపిణం, 

  శ్రీ చంద్రశేఖర గురుం 

  ప్రణమామి ముదావహం " 

ఏతత్ సర్వం శ్రీకంచికామాక్షీదేవ్యార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ