వివేకానందుని జయంతి - స్ఫూర్తి దాయకుడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

నేడు వివేకానందుని జయంతి. శుభాకాంక్షలు.

వివేకానందులు " నేను నా మతం యొక్క గొప్పదనాన్నే చెబుతాను, ఇతర మతాలను తక్కువచేసి మాట్లాడను. ఎందుకంటే అవన్నీ మా మతంలోంచి వచ్చినవే. ఏ విషయం మాట్లాడుకున్నా దాని మూలాలు మా సనాతనధర్మంలో కనబడతాయి " అని తరచుగా అనేవారు.

వివేకానందుడు " మేము విగ్రహాన్ని దేవుడుగా చూడం, విగ్రహంలోని దేవుడిని చూస్తాం, పూజిస్తాం " అని చెప్పేవారు.

వివేకానందుడు భయాన్ని వదిలేయమన్నారు. భయమే దుఃఖానికి మూలం. ఆయన ఓ చక్కటి కధ కూడా చెప్పారు.

వంటలన్నీ తయారు చేసి పెట్టి అక్కడివారు ప్రక్కకు వెళ్ళారు ఏదోపనిమీద. ఓ కుక్క వచ్చింది. తినదామని ఎదరికి వెళ్ళడం, ఎవరైనా వచ్చి నడ్డివిరగ్గొడతారేమో అని ఇటూఅటూ చూడడం. ఒకవేళ ఏదో కొద్దిగా తిన్నా భయంతో తిన్న తిండి దానికి సంతోషమేమి కలిగిస్తుంది.

మానవజీవితం కూడా అంతే. ఎప్పుడూ ఏదోదానిగురించి భయపడుతూ బ్రతికే జీవితం అవసరమా అన్నారు వివేకానందుడు. అందుకనే నిర్భయత్వం అలవాటుచేసుకోమన్నారు.

వివేకానందులు చికాగో జరిగిన సర్వమతసమ్మేళనంలో " సోదరసోదరీమణులారా, ప్రపంచమతాలకు తల్లి అయిన సనాతనధర్మం, భారతదేశప్రజల తరపున మీకు నమస్కరిస్తున్నాను " అని అన్నది సత్యం ఇచ్చిన ధైర్యం వలన. అంతమంది వివిధమతాధిపతులు మాట్లాడిన ప్రదేశం వివేకానందుల మాటలనే ఎందుకు ప్రతిధ్వనిస్తూంది. చికాగోలోని ఒక వీధి " వివేకానందుడు వీధి " ఎందుకు అయింది. ఋషులు వేసిన సనతనధర్మ పునాదుల పటిష్ఠత అది. ఎందరో మూర్ఖులు దాన్ని పడగొట్టాలని ప్రయత్నించినా, ప్రయత్నిస్తూన్నా తట్టుకుని నిలబడగలుగుతూందంటే దాని విలువ, విశాల విస్త్రృతభావన అటువంటిది కనుక.

ప్రపంచశాంతికి మన సనాతనధర్మ‌ం తప్ప వేరే దారి లేదు.

ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా సనాతనధర్మ పరిరక్షణకోసం శ్రమించారు వివేకానందుడు. కారణజన్ములు. ఆయన జయంతి రోజున ఆయనను ప్రత్యేకంగా తలుచుకుని తరిద్దాం.

సర్వేజనాః సుఖినోభవంతు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ