" భోగి " అంటే ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

భోగి, సంక్రాంతి పండుగులగురించి పూజ్యులు గరికిపాటివారు ఓ ప్రవచనంలో కొన్ని అద్భుత విషయాలు తెలియచేసారు. 

సంస్కృతంలో భోగి అంటే " తయారు ( ప్రిపరేషన్ ) " అని అర్ధంట. ఏ పండుగకైనా ముందరరోజే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఉగాది అనుకోండి - వేపపువ్వు, మామిడికాయ, చెరకుముక్కలు లాంటివి ముందరరోజే ఏర్పాటు చేసుకుంటాం. దీపావళి అయితే చెప్పనక్కరలేదు. టపాసులు, అమ్మవారిపూజకి ఎక్కువగా పువ్వులు స్వీట్స్ మొ.గు నవి ముందరే ఏర్పాటుచేసుకోవాలి. దసరాలయితే అమ్మవారి పూజలకి దండలు వత్తులు పూలు తప్పనిసరి. అంటే ఏ పండుగకైనా ముందరరోజుని " భోగి " అనే పిలుచుకోవచ్చు.

శారదానవరాత్రులు అంటే ఏర్పాట్లకు ఒకరోజు సరిపోదు. 7/10 రోజులు పడుతుంది. 9 రోజులు 9 అలంకారాలు. అమ్మవారికి రకరకాల సువాసనలు, రంగులు, ప్రసాదాలు, పువ్వులు ఇష్టం. రకరకాల గాజులు, రవికెలగుడ్డలు, పూలు, వేరువేరు సువాసనల అగరబత్తీలు ఎన్ని ఏర్పాట్లు. ఇల్లంతా శుభ్రం చేసుకోవడం. అందుకని ఇటువంటి పండుగలకు భోగిరోజులు ఎక్కువగా ఉంటాయి. 

ఏమున్నా ఏమిలేకపోయినా అమ్మవారికి ముఖ్యంగా కావల్సినది శ్రద్ధ, భక్తి. శరణాగతి అని ఒక్క నమస్కారం పెట్టుకున్నా అనుగ్రహిస్తుంది " అవ్యాజకరుణామూర్తి ".

" పత్రం పుష్పం ఫలం తోయం .... " 

- ( భ.గీత 9:26 )" 

- అన్నారు పరమాత్మ గీతలో. ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను అన్నారు పరమాత్మ.

అందుకని మరీ ఎక్కువ ఆర్భాటాలు లేకుండా భక్తిశ్రద్ధలతో సేవించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం.

నేడు " భోగి పండుగ " - శుభాకాంక్షలు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. Please enlighten me on Avyaja Karuna Murthy. This we come across in Lalitha Sahasranamam.
    K S Sastry

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ