తాత్కాలిక వసతులు, భోజనాలు రామాయణకాలంలోనే - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
రామాయణం ఎంతటి అద్భుత కావ్యం.
రాముడు అరణ్యవాసానికి వెళ్ళాక భరతుడు ఆయన్ని ఎలాగైనా ఒప్పించి వెనక్కు తీసుకురావడానికి మందీమార్బలంతో వెడతాడు. దారిలో భరధ్వాజమహర్షి ఆశ్రమానికి వెడతాడు సైన్యాన్ని దూరంగా ఉంచి.
మహర్షి " మీకు అతిధిసత్కారాలు ఏర్పాటుచేస్తాను ఉండు " అంటారు. భరతుడు " మీకు శ్రమవద్దు, పళ్ళూ అవీ తిని కాలక్షేపం చేస్తాము " అని అంటాడు. అప్పుడు మహర్షి అంటారు " నువ్వు రాజువి, అలా చేయవచ్చు కాని నీక్రింద పనిచేస్తున్నవారిని సౌకర్యవంతంగా చూసుకోవాలి. వారికి అవసరమయిన/ఇష్టమయిన తిండి, వసతి
చూడ్డం నీ బాధ్యత. ఇప్పుడు మీరు నా అతిధులు కనుక ఆ బాధ్యత నాది " అంటారు. అదీ మన ఋషుల ఔన్నత్యం, మన అద్భుత సంస్కృతి.
వారి ఏర్పాట్లకోసం హోమం ముందు కూర్చుని దేవతలను ఆవాహన చేస్తారు పనులకోసం. విశ్వకర్మని ఇంద్రాది దిక్పాలకులను సోముడిని, కుబేరుడిని నదులను ఆహ్వానిస్తారు. అందరూ వచ్చి భవనాలను రుచికరమైన వంటలు ఏర్పాటుచేస్తారు.
ఇక్కడ వింత విషయమేమిటంటే " సోముడు " రకరకాల రుచికరమైన " మాంసపు వంటకాలు " ఏర్పాటు చేస్తాడు అతిధులకోసం.
మహర్షులు తాము తినేది పళ్ళూ, కందమూలాలయినా అతిథులకు వారికి ఇష్టమయినవి కష్టపడైనా సమకూర్చేవారు. " అతిథి దేవోభవ " అంది మన సనాతనధర్మం.
తాత్కాలిక వసతుల ఏర్పాటు, బయటివారిచేత భోజన సదుపాయాలు చేయించడం వేల సంవత్సరాల క్రితమే ఉన్నట్లుగా రామాయణం తెలియచేస్తూంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రక్రియ. ఎంత అద్భుతం మన సంస్కృతి.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment