రాముడు సీతను అడవికి పంపడమేమిటి? - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" రామో విగ్రహవాన్ ధర్మః "
- శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మము. ఈ మాట అన్నది రాముడి వీరభక్తుడో బంధువో స్నేహితుడో కాదు. విశ్వామిత్రుడి యజ్ఞరక్షణ సమయంలోనే రాముడి చేతిలో చావుదెబ్బ తిన్న మారీచుడనే రాక్షసుడు. అన్నది తన స్నేహితులదగ్గరో బంధువులదగ్గరో కాదు. లంకాధీశుడైన రావణుడితో. దీన్నిబట్టి రాముడు ఎంతటి సంస్కారవంతుడో ధర్మానికి ఎంతగా కట్టుబడతాడో తెలుస్తుంది.
అటువంటి మహనీయుణ్ణి " గర్భవతి అయిన భార్యను ఎవరో అనామకుడు కూసిన కూతలను పట్టుకుని అడవికి పంపించేస్తాడా " అని కొందరు అనడం తరచు చూస్తూంటాం/వింటూంటాం.
కైకేయికి దశరధుడు వరం ఇవ్వడంతో తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి రాముడు అడవికి వెళ్ళవలసి వచ్చింది. తను ఒక్కడే వెడతానంటే సీతాదేవి తనుకూడా వస్తానంది. అప్పుడే వివాహం అవడం, భర్తను విడిచి ఉండడం కొంచెం కష్టమే కనుక ఆమె కోరికలో తప్పు పట్టడానికి ఏమీలేదు. దారిలో ఎందరో రాక్షసులు దాడి చెయ్యడం రాముడు ఖరాదులను ఎందరినో సంహరించడం జరిగింది. ఒక మహారాజు కూతురుగా ఆవిడకు పరిస్థితులన్నీ అర్ధమయ్యే ఉండాలి. శూర్ఫణఖ వచ్చి రాముణ్ణి వివాహమాడతాననడం ఆయన లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళమనడం ఆయన ఆమె మరీ మంకుపట్టు పట్టడంతో ముక్కు చెవులు కోసి పంపించడం జరిగింది. సీతాదేవికి " ఇలా జరుగుతున్నాయేమిటి విషయాలు " అని అనిపించి ఈ రాక్షసుల మాయలతో కొంచెం జాగరూకతతో ఉండాలని అనిపించి ఉండాలి.
బంగారు మాయలేడిని చూడగానే ముచ్చట పడడంలో తప్పులేదు. తను ముచ్చటపడింది కనుక తీసుకువస్తానని రాముడు బయలుదేరబోయినా " ఇది రాక్షస మాయేమో, బంగారు వర్ణంలో లేడి ఏమిటి, మనది కాని చోట ఉన్నాం, మీరు వెళ్ళవద్దు " అని రాముణ్ణి ఆపవలసిన సీతాదేవి " ఇది తప్పకుండా రాక్షస మాయే, వెళ్ళవద్దు " అని లక్ష్మణుడు చెప్పినా తను రాముణ్ణి ఆపలేదు. రాముడు లక్ష్మణుడితో ఎట్టిపరిస్థితుల్లోనూ సీతని వదలి మాత్రం రావద్దంటే " పుత్రుడి " తో సమానమైన లక్ష్మణుడిని నానా మాటలతో అవమానించింది. ఆయన వెళ్ళక తప్పని పరిస్థితుల్లో " లక్ష్మణరేఖ " ని గీసి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని దాటి రావద్దంటే బిక్షవెయ్యడానికని దాన్నీ దాటింది.
ఒక తప్పు కాదు, తప్పుమీద తప్పు.
పార్వతి అమ్మవారు " సోమసూర్యాగ్నిలోచనుడు" శివుడి కళ్ళు మూసి ప్రకృతి విలయానికి కారణమయిన కారణంగా ఆయన శాపానికి గురి అయి కాంచీపురం వెళ్ళి వేలసంవత్సరాలు తపస్సు చేసి శాపవిమోచనం పొందింది.
" ప్రారబ్దం భోగతో నశ్యేత్ " అన్నారు అంటే " మంచివి అయినా చెడ్డవి అయినా కర్మలు అనుభవించడంతో ( నే ) నశిస్తాయి " అని.
మరి అమ్మవారికే కర్మఫలం అనుభవించడం తప్పనప్పుడు మానవమాత్రురాలైన సీతాదేవికి తప్పుతుందా. అదే జరిగింది అనుకోవాలి కాని జగదానందకారకుడైన శ్రీరాముణ్ణి తప్పు పట్టడం భావ్యం కాదేమో.
" శ్రీరామ జయరామ
జయ జయ రామ " అనే 13 అక్షరాల మంత్రపారాయణ ఎటువంటి ఆపదలనైనా తొలగించి రక్షణ కలిగిస్తుంది. రోజూ కనీసం 13 సార్లు పారాయణ చేయడం ఉత్తమం. ఆయన దయార్ద్రహృదయుడు, చెయ్యకపోయినా రక్షణ కలిగిస్తాడు. పారాయణ మన సంతృప్తి కోసం మాత్రమే.
చిన్నపిల్లలకి ( ఇప్పటికీ పెద్దవాళ్ళు కూడా ) స్నానం అవగానే తల్లులు " శ్రీరామరక్ష నూరేళ్ళ ఆయుష్షు " అని తలచుట్టూ నీళ్ళు తిప్పుతారు. ఆయన రక్షణకి అంత శక్తి.
ఏతత్ సర్వం శ్రీ శ్రీరామచంద్రపాదారవిందార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏🙏🙏
ReplyDelete🙏🙏🙏
ReplyDeletePl mention ur Name n Mobile number
ReplyDeleteThe main purpose of Ramavataram is to kill Ravana and other evil forces to establish Dharma. The entire scheme of things is pre determined and Sita Devi is to spend some time in Asoka vanam and become a cause for killing Ravana.Therefore rescuing Sita from the hands of Ravana by Ramanama smaranam does not make sense.
ReplyDeleteK.S.Sastry 9573966709
Good response. Ramanama Smarana is for common people like me to come out of distress. Future post will be abt Ramanama, which may clear more doubts. TKS for the response. Goddess bless you all
ReplyDelete