బాలరామ ప్రతిష్ట - మన జన్మలు ధన్యం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
నేడు శ్రీరామజన్మభూమి అయోధ్యలో " బాలరామ" ప్రతిష్ట. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. మన జీవితకాలంలో ఈ బాలరామ ప్రతిష్టాపన జరుగుతూంది కనుక మన జీవితాలు ధన్యమయాయి. ఎందరో ధన మాన ప్రాణత్యాగం చేస్తే ఇది సాధ్యమయింది. మనం ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఎవరో ఫలవృక్షం విత్తనం వేస్తే పండు మనం తింటూన్నట్లు గా లేదూ?.
సనాతనధర్మం పునర్జన్మని ప్రతిపాదించింది. మనలో కొందరయినా ఆ కష్టపడినవారిలో గతజన్మలలో ఉండి ఉండడానికి అవకాశం మెండు. లేకపోతే ఇటువంటి భాగ్యం కలుగదు.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment