పైకి శ్రీరామజపం చేస్తూ లోపల కత్తులు నూరడం న్యాయమా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" శ్రేయాన్ స్వధర్మో విగుణః 

  పరధర్మాత్ స్వనుష్ఠితాత్,

  స్వధర్మే నిధనం శ్రేయః 

  పరధర్మో భయావహః " 

              - భ.గీత 3:35

" పరధర్మమును చక్కగా నిర్వహించుటకన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది. దానిని పాటించుటకన్నను స్వధర్మపాలనమునందు నాశనమును పొందుటయైనను ఉత్తమమైనది " అన్నారు పరమాత్మ.

కొద్దిగా లోపాలున్నా స్వధర్మమే మేలు, పరధర్మం భయంకరమైనది అన్నారు పరమాత్మ గీతలో.

దేశమే కాకుండా ప్రపంచమంతా జనవరి 22 దగ్గర పడుతూంటే శ్రీరామ జపంతో ఉప్పొంగిపోతూంటే ఒక నాయకుడు " వారు బయటకు రామజపం, లోపల కత్తులు నూరడం చేస్తారు " అని ప్రకటన చేసారు.

ధర్మానికి హాని జరిగే అవకాశముందని అనిపిస్తే కత్తులు నూరి తయారుగా పెట్టుకోవాలి, తప్పుకాదు.

ఓ ఉదాహరణ చూద్దాం. ఓ పెద్దాయన ఉదయాన్నే సంధ్యావందనం, విష్ణు/లలిత సహస్రనామపారాయణం, శ్రద్ధగా పూజ చేసుకుంటారు రోజూ. సాయంత్రం అవగానే ఆల్ ఔట్ స్విచ్ వేస్తారు. పైగా దోమల బ్యాట్ పట్టుకుని కూర్చుంటారు. దోమ కనబడగానే బ్యాట్ తో ఠప్ అనిపిస్తారు. వంటింట్లో బొద్దింకలు చావడానికి జెల్ చుక్కలు పెడతారు. ఎలక ఇంట్లో తిరుగుతూంటే 2,3 చోట్ల మందుపెట్టి అది చచ్చాక బయటపడవేయిస్తారు.

ఇంతటి గుణవంతుడికి ఇతర జీవులని చంపవలసిన అవసరం/హక్కు ఉందా అంటే ఉంది. ఈ జీవులన్నీ ఈయన ధర్మకార్యానికి హాని చేస్తున్నాయి.

పూజచేయాలన్నా, అన్నీ ఇచ్చి రక్షిస్తూన్న అమ్మవారికి కనీసం పప్పు, కూరతో నైవేద్యం పెట్టాలన్నా, ఎవరికైనా అవసరానికి సహాయపడాలన్నా శరీరం సహకరించాలి. అందుకే శరీరధారణని అంటే వ్యాయామం ని ( నడక, పరుగు, ఆటలు ) కూడా యజ్ఞం అంటారు. శ్రద్ధగా చేసి శరీరాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

మరి పై జీవులన్నీ ఏమి చేస్తున్నాయి. శరీరానికి హాని చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండి వాటిని తుదముట్టించకపోతే హాస్పిటల్ లో చేరవలసి వస్తుంది, లేదా ప్రాణం కూడా పోవచ్చు. ఇంక ధర్మపాలన ఎలా కుదురుతుంది.

పైకి రామనామజపం చేస్తూన్నా లోపల " ధర్మరక్షణకోసం " కత్తులు నూరుతూ కూడా ఉండాలి. తప్పుకాదు.

" ధర్మో రక్షతి రక్షితః "

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయత్

Comments

  1. Sarigga selavichharu. Violence is justified and is a form of defence for protecting Dgarma.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ