భ.గీత 7:16 - ప్రవచనాలు " వినడంవల్ల ఉపయోగమేమయినా ఉందా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏


" చతుర్విధా భజంతే మాం,

  జనా స్సుకృతినో2ర్జున,

  ఆర్తో జిజ్ఞాసురర్దార్ధీ 

  జ్ఞానీచ భరతర్షభ "

             - భ.గీత 7:16

" ప్రవచనాలు " వినడంవల్ల ఉపయోగమేమయినా ఉందా అని ఎందరికో సందేహం.

భక్తులు 4 విధాలు అన్నారు పరమాత్మ: 

1. ఆర్తః : ఆపత్తునందున్నవాడు

2. జిజ్ఞాసుః : ( భగవంతుని) 

తెలుసుకొనగోరువాడు

3. అర్దార్ధీ : ధనములను 

అభిలషించువాడు

4. జ్ఞాని : జ్ఞానము కలవారు

నలుగురూ నన్ను సేవించేవారే అన్నారు పరమాత్మ.

భక్తులు ఉదా:

1వ రకం. గజేంద్రుడు 

2వ రకం. పరీక్షిత్తు, ఉద్దవుడు 

3వ రకం. సుగ్రీవుడు ధృవుడు 

4వ రకం. శుకుడు సనకుడు నారదుడు.

1వ రకం లో ఒకరే చెప్పుకున్నాం. కాని మనలో చాలా చాలా ఎక్కువమంది ఆ కోవలోకి వస్తాం. ఆపద రాగానే లేక ఏదయినా ఫలితంకోసం మ్రొక్కులు, దేవాలయ సందర్శనలు, పూజలు, జపాలు మొ.గునవి చేస్తూంటాం. కాని ఆ విధంగా చేసినా నన్ను సేవించినట్లే అని అనుగ్రహించారు పరమాత్మ. 

భ.గీత 7:17 లో స్వామి చెప్పినది " వీరిలో జ్ఞానులు నాకు ఇష్టులు " అని. సహజమే. కాని పరీక్షిత్తు, ఉద్దవుడు, సుగ్రీవుడు, ధృవుడు తక్కువవారు కాదుగా. అంటే మిగతా ఈ మూడు రకాల 

భక్తులు సేవలతో కాలక్రమేణా జ్ఞానులవుతారు అని అనుకోవచ్చు. ఒక శ్రద్ధగా ఉండే అతనిని " ఇది తెలుసా " అని అడిగితే " అతను తెలియదు " అన్నాడనుకోండి, తెలియదు అనే విషయం తెలిసింది కనుక అతను జ్ఞానే అని అనుకోవాలి.

మరి ఇంతకీ " భక్తి " అంటే ఏమిటి. 

" శ్రవణం కీర్తనం విష్ణోః 

  స్మరణం పాద సేవనం, 

  అర్చనం వందనం దాస్యం 

  సఖ్యం ఆత్మ నివేదనం " 

               - భాగవతం

వ్యాసర్షి భక్తిగురించి చెబుతూ వీటిలో ఏది చేసినా ఉత్తమమే అన్నారు. వీటిలో " శ్రవణం " తేలిక. 

" ప్రవచనాలు " వినగా వినగా లేక అష్టకాలూ అవీ వింటూ ఉన్నా భక్తి కొంచమైనా అంటుకుంటుంది. నాస్తి సంశయం.

మొదటి ప్రవచనం చేసినది శుకుడు, విన్నది పరీక్షిత్తు, చెప్పినది పరమపవిత్ర " భాగవతం "

భక్తి " భజ్ " ధాతువునుంచి వచ్చింది. అందుకేనేమో భజనలు, కీర్తనలు పాడి ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి, త్యాగయ్య, అన్నమయ్య లాంటివారు కారణజన్ములు, పుణ్యపురుషులయారు. 

అమ్మవారు " నాదరూపిణి, గానలోలుప ( గానాన్ని ఇష్టపడేది ) " అని కొలువబడుతూంది.

మూకశంకరులు " మూకపంచశతి " లో " చిరతర సుచరిత సులభా " అని అంటారు - అమ్మవారిని పట్టుకోవడం చాలా సులభంట, ఎప్పుడు, బహుకాలం మంచిగా సేవిస్తే అని.

అదే భ.గీతలో స్వామి " వైరాగ్యంతో కూడిన అభ్యాసంతో కష్టమేమీకాదు " అంటారు. " సాధనమున సమకూరు పనులు ధరలోన " - ప్రయత్నప్రారంభం చేద్దాం.

ఈరోజు మతత్రయ ఏకాదశి. శుభాకాంక్షలు.

ఏతత్ సర్వం శ్రీపరమాత్మార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ