ఆరోగ్యప్రదాత సూర్యదేవుడి పుట్టినరోజు నేడు - రధసప్తమి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" బందూకపుష్పసంకాశంం

  హారకుండలభూషితం

  ఏకచక్రధరం దేవం తం   

  సూర్యం ప్రణమామ్యహం " 

మంకెనపువ్వులా ఎర్రగా మెరిసిపోతూ ఉంటాడు సూర్యదేవుడు.

సూర్యుడి రధానికి ఒకటే చక్రంట. అది మన ఋషులు గ్రహించినది, చెప్పినది. సూర్యుడు సంవత్సరం పొడవునా ఒకే మార్గంలో ప్రయాణం చేయరు. ఒక్కో రాశిలో ఒక్కో కోణంలో ప్రయాణం చేస్తారు.

ఇప్పుడు కంప్యూటర్ లో ప్రోగ్రాం చేసి కనిపెట్టినది ఏమిటంటే వివిధ కోణాలలో అతివేగంగా ప్రయాణం చేయడానికి ఒక చక్రమే సరైనది అని. ఎంతటి అద్భుతం మన ఋషుల విజ్ఞానం.

" జామెక్కి భానుడు  

  జాజిపువ్వుఛాయ, 

  జాజిపువ్వుమీద 

  సంపంగి పూఛాయ, 

  శ్రీసూర్యనారాయణ మేలుకో 

  హరిసూర్యనారాయణ "

" వాలుతూ భానుడు   

  వంగపువ్వుఛాయ 

  వంగపూవుమీద   

  వజ్రంపుపొడిఛాయ

  శ్రీసూర్యనారాయణ మేలుకో

  హరిసూర్యనారాయణ "

సూర్యుడు ఉదయించే సమయంనుంచి సాయంత్రం వరకూ ఒక్కొక్క సమయంలో ఏపువ్వురంగులో ఉంటారో తలచుకుంటూ సూర్యుడిని మేల్కొల్పడం ఎంత అద్భుతం. 

ఇంట్లో పిల్లలకు రకరకాల బట్టలువేసి అలంకరణలు చేసి మురిసిపోయినట్లుగా సూర్యదేవుడిని రకరకాల పూవుల ఛాయలతో ఊహించుకుని మురిసిపోవడం ఎంత అద్భుతం. 

ఆయన ఉదయిస్తేనే జీవులలో చైతన్యం కలుగుతుంది. ఆయన కనబడని సమయాన్ని దోషకాలం అన్నారు ఋషులు.

సూర్యుడు మన ఇంటి సభ్యుడు. ఆయన లేని జీవితంని ఊహించడం కూడా చేయలేం. అందుకే వేల సంవత్సరాలుగా ఆయన్ని నిత్యం పూజిస్తూ సేవించుకుటుంన్నాం.

" ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ " - సూర్యుడు ఆరోగ్యప్రదాత. ఆహారప్రదాత కూడా. విత్తు మొలకెత్తాలన్నా వృక్షాలు ఫలాలనివ్వాలన్నా సూర్యుడు అనుగ్రహించవలసినదే.

మహాశక్తివంతమయిన గాయత్రీ మంత్రానికి అధిదేవత సూర్యుడు.

ఈరోజు రధసప్తమి. సూర్యదేవుడి పుట్టినరోజు. శుభాకాంక్షలు.

ఏతత్ సర్వం శ్రీసూర్యదేవార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ