ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించకూడదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ " అభిచార మంత్రములు " అని కొన్ని ఉన్నాయి. అవి ఇంకొకరిని నాశనం చెయ్యడానికి ఉపయోగించే మంత్రాలు.
" సర్వే జనాః సుఖినోభవంతు, లోకాః సమస్తాః సుఖినోభవంతు " అని కోరుకునే సంస్కృతికదా మనది, మరి అటువంటి మంత్రాలను శాస్త్రాలలో ఎందుకు పెట్టినట్లు అన్నది కొందరి సందేహం. తప్పులేదు.
వంట్లో సుగర్ బాగా పెరిగిపోయి కాలిమీద పుండు ఏర్పడిందనుకుందాం. వైద్యుడు అయ్యో కాలు తీసెయ్యడం ఏమిటి " హింస " కదా అనుకున్నా, రోగి రేపటినుంచి అందరూ " కుంటివాడు " అని పిలుస్తారేమో అని సిగ్గుపడినా విషం ఒళ్ళంతా ప్రాకడం, రోగి మరణించడం జరుగుతుంది.
" ధర్మో రక్షతి రక్షితః " - ధర్మాన్ని కాపాడితే అది తిరిగి కాపాడుతుంది.
అలాగ మన ధర్మానికి, దేశానికి, సంస్కృతికి, ఉనికికే హాని జరుగుతూన్నప్పుడు అలా చేస్తూన్నవారు నశించేలా చేసి " వాటిని " రక్షించమని భగవంతుడిని వేడుకుంటూ చేసే ప్రార్ధనలే ఈ అభిచారమంత్రాలు.
పోనీలే వారి పాపాన వారే పోతారు అనో, ఎవరో బాధపడతారనో, మనకెందుకులే అనో భావించి కిమ్మనకుండా కూర్చుంటే అది " మంచితనం " క్రిందకు రాదు, అసమర్ధత క్రిందకు వస్తుంది.
పరమాత్మ గీతలో మొదట్లోనే " క్లైబ్యం మా స్మ గమః - భ.గీత 2:3 " - " నపుంసకత్వం, హృదయదౌర్బల్యం విడనాడు ముందు " అని తెలియచేసారు.
ప్రపంచంలో మన సంస్కృతి మాత్రమే ఎప్పుడూ " వసుధైక కుటుంబం - సర్వే జనాః సుఖినోభవంతు " అని తెలియచేస్తుంది/భావించమంటుంది.
కాని హుషారుగా లేకపోతే " చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు " అని బాధపడవలసి వస్తుంది భవిష్యత్తులో. కొన్ని దేశాలలో ఇలా జరిగింది కనుక చూసయినా కొంచెం జాగ్రత్తపడాలి.
సర్వే జనాః సుఖినో భవంతు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏
ReplyDeletePl post ur name n mobile number
ReplyDelete