హృదయంలో దీపశిఖలా ఉంటారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏

" మునిమానసహంసికా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 816 వ నామం.

ఈనామం అర్ధం " మునుల మనస్సనే మానససరోవరమునందుండు ఆడుహంస " అని భాష్యం చెప్పారు.

అమ్మవారు అన్నారు " నాహం తీర్థే, న కైలాసే, వైకుంఠేవా న కర్హచిత్ " అని - అంటే తీర్థాల్లోనో, కైలాసంలోనో, వైకుంఠంలోనో ఉండను నేను " అని.

ఋషులు అడిగారు " వసామి కింతు?" - అంటే మరెక్కడ ఉంటావమ్మా అని. 

" మత్ జ్ఞాని హృదయాంభోజమధ్యమే " - అంటే " జ్ఞానుల హృదయాలలో ఉంటాను " అని తెలియచేసారు అమ్మవారు.

జడులు/అజ్ఞానులు గుడిలోని లింగాన్ని ఎలా చూడగలుగుతారో జ్ఞానులు తమ హృదయంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని అంతే స్పష్టంగా చూడగలుగుతారు.

" బ్రహ్మ సత్యం, జగన్మిధ్య " అన్నారు శంకరులు. అది తెలుసుకోవడమే జ్ఞానం. 

మునుల మనస్సు మానససరోవరంలా స్వచ్ఛంగా ఉంటుంది. దానిలో అమ్మవారు హంసలా ఉంటారు. హంస తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అందరికీ తెలుసు. 

శ్రీసూక్తంలో అమ్మవారిని ప్రార్ధిస్తూ " లోకైక దీపాంకురాం ( లోక+ఏక+దీప+అంకురాం ) అంటాం అంటే " లోకాలన్నింటికీ ఒకే ఒక్క దీపంగా ఉన్నది " అని. దీపం అంటే జ్ఞానం. లక్ష్మీదేవి జ్ఞానప్రదాత.

చీకటి పోవాలంటే దీపం కావాలి. అజ్ఞానాంధకారం పోవాలంటే దీపలక్ష్మి అనుగ్రహం కావాలి.

అమ్మవారు దీపశిఖలా ఉంటారు హృదయంలో. అజ్ఞానం/మాయ/మసి ఆవరించి ఉండడంవల్ల కనిపించదు. మాయ తొలగుతే అందా ఆనందమే.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ