శ్రీలలితమ్మవారి జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏 " శ్రీమాత్రేనమః " 🙏
" రామా రమణలంపటా " - అమ్మవారి అద్భుత నామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 319,320 వ నామాలు.
" రామా " అంటే స్త్రీస్వరూపాలన్నీ తానైనది, " రమణలంపటా " అంటే తన భర్త యందు ఆసక్తి/అనురాగం గలిగినది అని అర్ధం.
అనుమామేముంది. ఆకులు అలములు కూడా తినకుండా, మండుటెండలో నిప్పుల మధ్య నిలబడి తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుని అపర్ణగా పూజింపబడుతున్నారు అమ్మవారు.
ఆవిడకు భర్త అంటే అంత అనురాగం కనుకే భర్త హాలాహలాన్ని మ్రింగినపుడు ఆపద తప్పితే " జ్వాలాతోరణం " క్రింద నుంచి భర్తతో కలిసి 3 మార్లు ప్రదక్షణం చేస్తాను అని అగ్నిదేవుడికి మ్రొక్కుకుంది.
ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరి చేస్తూ ఇలా అంటారు :
" శరజ్జ్యోత్స్నా శుద్ధాం
శశియుత
జటాజూటమకుటాం,
వరత్రాసత్రాణ స్ఫటికఘటికా
పుస్తకకరాం, సకృన్నత్వా
న త్వాం కధమివ సతాం
సన్నిదధతే, మధుక్షీర
ద్రాక్షమధురిమ
ధురీణాః ఫణితయః ".
శరత్కాలంలోని వెన్నెలలా శుద్ధమై చంద్రుడితో కూడిన జటామండలంతో నిండిన శిరముకలిగి ఉంటుంది అమ్మవారు.
శరత్కాలపు వెన్నెలే అమ్మవారిలా అద్భుతంగా ఉంటే మాఘపౌర్ణమి నాటి వెన్నెల గురించి చెప్పనక్కరలేదు. ఆ వెన్నెలసమయంలో అమ్మవారి స్వరూపాన్ని తలచుకుంటే పాపాలన్నీ దగ్ధమవుతాయి.
ఈరోజు అమ్మవారు " శ్రీలలితాదేవి " జయంతి. శుభాకాంక్షలు.
అమ్మవారిని స్మరించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏🙏🙏🙏
ReplyDeletePl post ur name n mobile number also
ReplyDelete🙏
ReplyDelete