ముక్కు వైద్యులు - ఆయుర్వేదం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

ప్రాచీనభారతీయవైద్యం ఎంతో ఉత్కృష్టమయినది. ఎంతో సాధనచేసి ఋషులు మనకు అందించిన అద్భుతసంపద.

" ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ " అన్నారు. అంటే సూర్యుడు ఆరోగ్యప్రదాత. ఇప్పుడు ఏ వైద్యుడి దగ్గరకు వెళ్ళినా ఓ అరగంట ఎండలో నడవడమో కనీసం కూర్చోవడమో చెయ్యమంటున్నారు.

చిన్నప్పుడు మా అమ్మగారు ఎన్నో ఆశక్తికరమైన విషయాలు చెప్పేవారు.

ఓ సారి మా అమ్మగారు వేరే ఊరికి ఓ శుభకార్యానికి వెళ్ళారు. అక్కడ అమ్మకు విపరీతమయిన జ్వరం వస్తే కొంచెం భయపడ్డారు బంధువులు. వారి ఆయుర్వేదవైద్యుడిని పిలిచారు. ఆయన ఇంటిపేరు " ఆకెళ్ళ ". ఆయన వచ్చి నాడి పట్టుకుని " ఈవిడ పుట్టింటివారిది ఫలానా ఇంటిపేరా " అని అడగడం అందరూ ఆశ్చర్యపడి " ఎందుకని అలా అడిగారు " అంటే నాడి వారిదిలా ఉంది అని 2 డోసుల మందు ఇచ్చారు. మరునాటికి జ్వరం వచ్చిన సూచనలే లేవుట.

మా ప్రక్క గ్రామంలో అన్నదమ్ములు వైద్యం చేసేవారు. ఒకాయనని కుడిముక్కు వైద్యులు అని, ఇంకో ఆయన్ని ఎడమముక్కు వైద్యులు అని పిలిచేవారు. ఏ రోగం వచ్చినా వారు ఆవైపు ముక్కు పరీక్షించి మందులు ఇచ్చేవారు. అంటే ఆ ఆ ( ఇడ, పింగళ ) నాడీపరీక్ష చేసేవారని అనుకోవాలి.

కొన్నిరోజులక్రితం డాక్టర్ దగ్గరకు వెడితే అన్నీ నార్మల్ గానే ఉన్నాయి, నాలుక చూపించండి అంటే ఆశ్చర్యం వేసింది. అది ఆయుర్వేదవైద్య ప్రక్రియ మరి. కేవలం నాలుకను చూసి మందు ఇచ్చేసేవారు ఆయుర్వేద వైద్యులు..

అదీ మనపూర్వీకుల పరిజ్ఞానం.

మా చినమామయ్యగారు వేదపండితుడు, ప్రాచీనవైద్యంలో దిట్ట. చిన్న చిన్న శస్త్రచికిత్సలు కూడా చేసేవారు 1930 లలోనే. ఆయన గురించి రేపు చదువుకుందాం.

ఈరోజు ఆరోగ్యప్రదాత సూర్యదేవుడికి ప్రీతికరమయిన మాఘపాదివారం. శుభాకాంక్షలు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ