సర్వోపనిషదుద్ఘుష్టా - వేదఘోష - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః 🙏 

" సర్వోపనిషదుద్ఘుష్టా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 852వ నామం.

ఈ నామానికి అర్ధం అన్ని ఉపనిషత్తులలోనూ అధికముగా " దండోరా " వేయించబడి మరీ చెప్పబడినది. " ఉద్ఘుష్టా " అంటే " ఎలుగెత్తి చాటబడినది " అని అర్ధం. ఉపనిషత్తులలో చెప్పబడినది ఏమిటి - అమ్మవారి అద్భుతగుణగణాలే గా. వేదసారమంతా అమ్మవారి గొప్పదనం గురించేగా. అదేమీ ఆవిణ్ణి పొగడడంకాదు. ఆవిడ చేస్తూన్న అద్భుతమైన కార్యక్రమాలనే చెబుతున్నాం, అది ఎంత " గఠిగా " చెబుతే అమ్మవారు అంతగా మురిసిపోతుంది. అందుకే వేదపారాయణని " వేదఘోష " అని ముద్దుగా పిలుచుకుంటారు.

అందుకే శ్యామలాదండకం, శివతాండవస్తోత్రం, కాలభైరవాష్టకం, మహిషాసురమర్దినీస్తోత్రం లాంటివి ఎలుగెత్తి పఠిస్తూంటే మన బుద్ధులు ప్రచోదనచెందుతాయి, అమ్మవారు మురిసిపోతారు. 

విష్ణుసహస్రం చెప్పినప్పుడు ధర్మరాజు అంటాడు భీష్ముడితో " తాతా ఇంత అద్భుతంగా ఎలా చెప్పావు " అని. ఆయన అంటారు " నేను పరమాత్మ గుణగణాలని ఉన్నవి ఉన్నట్లుగా చెప్పాను అంతే, ఆయన గుణాలు అద్భుతం కనుక నీకు అద్భుతంగా అనిపించాయి " అని.

విష్ణుసహస్రంలో ఒక నామం " సుఘోషః " అంటే మంచి ధ్వనిని కలిగిఉన్నవాడు/ఆస్వాదించువాడు " అని. 

మాగ్రామంలో శ్రీశారదాదేవీనవరాత్రుల ఉత్సవాలు 1960 సం.లో మొదలయ్యాయి. 

అమ్మవారిపూజల్లో పగలు ఉపవాసం. రాత్రి మహాపూజ, ఊరంతా భోజనాలు. మధ్యాహ్నం ఛండీహోమం జరుగుతుంది. రాత్రి అమ్మవారికి నైవేద్యం అయాక పచ్చకర్పూరం, జాజిపత్రి ఏలకులు లవంగాలు వేసి తాంబూలం ఇస్తారు. ఆవిడ దాన్ని నములుతూ చిరునవ్వుతో సింహాసనం మీద కూర్చుని అందరినీ వాత్సల్యంతో చూస్తూ ఉంటుంది. ఇద్దరు అటూ ఇటూ నుంచుని వింజామర వీస్తూ ఉంటే మంత్రపుష్పం మొదలవుతుంది. అటు పదిమంది ఇటు పదిమంది నుంచుని చదువుతూ ఉంటే ప్రతిధ్వనిస్తుంది. అది " వేదఘోష ", అమ్మవారు తెగమురిసిపోతారు. తరువాత వేదపారాయణ జరుగుతుంది రోజూ. ప్రక్కగ్రామాలవారు కూడా చాలామంది పూజలకు హాజరయి అమ్మ అనుగ్రహం పొందుతారు. 

ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే నిత్యనూతనంగా చేసుకునేలా మా గ్రామస్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాది భోగభాగ్యాలని ప్రసాదించి అనుగ్రహించమని శ్రీశారదాదేవి అమ్మవారిని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. It appears that Sanatana Dharma is being followed in your village with devotion strictly. I would like to see your village . Please let me know the name of village.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ