శ్రీశ్యామలాదేవీనవరాత్రులు నేటినుండి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మంత్రిణీన్యస్తరాజ్యధూః " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 786 వ నామం.

" మంత్రిణీన్యస్తరాజ్యధూః " అంటే మంత్రిణి అయిన శ్యామలాదేవికి అప్పగించబడిన రాజ్యభారం గలది. 

భండాసురుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజ్యభారాన్ని శ్యామలాదేవికి అప్పగించారు అమ్మవారు. శ్యామలాదేవి ముఖ్యమంత్రిణి, మన బాగోగులు చూస్తారు. వారాహీదేవిని రక్షణమంత్రిణిగా నియమించారు, మన క్షేమంకోసం. 

మాఘశుద్ధ పాడ్యమి అనగా నేటినుంచి నవమిదాకా శ్రీశ్యామలాదేవీనవరాత్రులు. భక్తులు అమ్మవారిని తొమ్మిది రోజులూ భక్తితో సేవించుకుని అనుగ్రహాన్ని పొందుతారు.

అమ్మవారు ఇవ్వలేనిది లేదు. శ్రద్ధగా రాజశ్యామలయాగం చేస్తే చక్రవర్తిని చేస్తుంది. 

అమ్మవారి అవ్యాజకరుణ, మహత్తు తెలియాలంటే మహాకవి కాళిదాసు ని గుర్తుచేసుకుంటే చాలు. 1600 సం.లయిపోయినా మహాకవి అంటే కాళిదాసు అని గౌరవించుకుంటున్నాం. ఆయన నాలుకమీద బీజాక్షరాలు వ్రాయగానే ఆయన చేసిన మొదటి ప్రార్ధన " శ్రీశ్యామలాదేవీదండకం ". ఇప్పటికీ ఎవరు పాడినా మనస్సు పులకిస్తుంది. అంతటి అద్భుత విద్వత్తుని ఇస్తుంది తల్లి.

చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శ్రీలలితాదేవీనవరాత్రులు, ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శ్రీవారాహీదేవీనవరాత్రులు, ఆశ్వయుజశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శ్రీశారదాదేవీనవరాత్రులు గానూ భక్తులు అమ్మవారిని పూజించి సేవించుకుంటారు.

" యాదేవీ సర్వభూతేషు 

  శాంతి రూపేణ సంస్థితా, 

‌  నమస్తస్యై నమస్తస్యై 

  నమస్తస్యై నమోనమః "

మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. అమ్మవారిని ధ్యానించుకుని ఆశీస్సులు అందుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ