వేదో2ఖిలమూలం - మన వేదాలే అన్నిటికీ మూలం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
జాతకాలు నమ్ముతారేమిటో భారతీయులు అంటారు కొందరు మనవారు కూడా. ఇంకో 100 సం.ల తరువాత కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏరోజున ఎన్నిగంటలకు వస్తుందో కచ్చితంగా చెప్పే మన పండితులు చెప్పే జాతకాలు నమ్మకుండా ఎలా ఉండగలం.
వేల సంవత్సరాల క్రితమే భూమికి సూర్యుడికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా ( హనుమాన్ చాలీసా ) చెప్పిన భారతీయ విజ్ఞానం అద్భుతం అని నమ్మకుండా ఎలా ఉండడం.
తంజావూర్ బృహదీశ్వరాలయం ఎత్తు 200 అడుగులు. దీని పునాది ఎంతో ఊహించగలమా?. 4 అడుగులు. ఇప్పుడు 50 అడుగుల ఎత్తైన బిల్డింగు కడితే పునాది 8/10 అడుగులు వేస్తున్నారు.
గుడిపైన 3/5/7 కలశాలు ఉంటాయి. అవి నిలబెట్టిన భాగాన్ని విమానం అంటారు. ఈగుడియొక్క ఆ విమానం శిల బరువు ఊహించగలమా?. 82 టన్నులు. అసలు అంత బరువు రాయిని అక్కడకు ఎలా తీసుకుని వెళ్ళారన్నది ఇప్పటికీ వింతే.
కుతుబ్మీనార్ అసలు పేరు విష్ణుస్తంభం. అసలు దానిలో ఏ మెటల్స్ వాడారో, ఇంతకాలం తుప్పుపట్టకుండా ఎలా ఉందో ఇప్పటికీ వింతే.
తక్షశిల విశ్వవిద్యాలయంలో 10వేల మంది విద్యార్ధులు ప్రపంచనలుమూలల నుండి వచ్చి 60 రకాల విద్యలను అభ్యసించేవారు. ఇప్పుడు ఉన్నతచదువులకై విదేశాలకు వెడుతున్నారు.
రామసేతు వేలసంవత్సరాలక్రితం కట్టబడినది అని మనవారు చెప్పినా చివరికి నాసా చెప్పినా నిజమా అనిపిస్తూంది చాలామందికి.
విజయనగరసామ్రాజ్యంలో ముత్యాలు రత్నాలు వీధుల్లో రాశులుగా పోసి అమ్మేవారు అని విదేశీయాత్రికులు వ్రాసారు అని తెలుస్తూంది.
పసుపు, వేపల ప్రయోజనాల గురించి తెలియనివారు అవి వారే కనిపెట్టామంటున్నారు.
మనవారు పట్టుబట్టలు పట్టుచీరలు కట్టుకుని మెడలో నగలు, శిరస్సుపై కిరీటాలు అలంకరించుకుని రోయల్ గా జీవించినకాలంలో గోచీలు కూడా లేకుండా తిరుగుతూ ఆకులు అలములు తిన్నటువంటివారు ఈ రోజు మనకు పాఠాలు చెబుతున్నారు.
" రివర్స్ " జరుగుతూంది. గురువు విద్వత్తుని శిష్యుడు మెచ్చుకుని అభినందించినట్లు వారు మన కట్టడాలకు " ప్రపంచ వారసత్వ గుర్తింపు " ని ఇస్తున్నారు.
నేరం వారిదికాదు. ఆత్మాభిమానం, ఆత్మబలం తక్కువైన మనదే.
నిద్రపోయిన వారిని లేపగలం. నిద్రనటించే వారిని ఎలా లేపగలం. ఇప్పుడు భారతీయుల పరిస్థితి ఇది.
" క్లైబ్యం మా స్మ గమః
పార్ధ .................."
- భ.గీత 2:3.
" నపుంసకత్వాన్ని విడిచి పెట్టు అర్జునా " అన్నారు పరమాత్మ. అది అంత సులభంకాదు. 1000 ఏళ్ళ బానిసత్వం అంత తొందరగా వదలదు. ప్రయత్నం గట్టిగా చెయ్యాలి, పోయేదేమీలేదు.
ఇంకో వివేకానందుడు శీఘ్రంగా పుట్టుకొస్తాడని ఆశిద్దాం.
హమారా సనాతనధర్మ మహాన్ - సూర్య.
శుభం భూయాత్
Everyone should read this
ReplyDeletePl mention ur name n mobile number also. Tq
ReplyDelete