పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం గారి వర్ధంతి నేడు - చీమల పాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" యస్య దేవే పరాభక్తిః
యధా దేవే తధా గురౌ "
- కఠోపనిషద్
" ఏ దేవి అనుగ్రహం కోసం జపం చేస్తున్నామో ఆ దేవిమీద అఖండభక్తి ఉండాలి. అంతే భక్తి గురువుమీద ఉండాలి " అని కఠోపనిషద్ తెలియచేస్తూంది.
శ్రీరంగం గోపాలరత్నం గారికి పద్మశ్రీ బిరుదు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో " ఈకాలం పిల్లలకు సంగీతం నేర్చుకోవడానికి, సాధనకు సమయమే లేదంటున్నారు. మీరు ఇలా ఎలా " అంటే ఆవిడ " అప్పుడూ ఇప్పుడూ రోజుకు 24 గంటలే. ఇప్పుడు సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందింది కూడా. మా కాలంలో కష్టపడినట్లుగా ఇప్పటి పిల్లలు కష్టపడక్కరలేదు కూడా. గురువును త్రికరణశుద్ధిగా నమ్మి సంగీతాన్ని సాధన చేస్తే తప్పక ఫలితం ఉంటుంది " అన్నారు.
" మంచి గురువును పట్టుకుని, సేవ చేసుకుని, మంచిజ్ఞానం సంపాదించుకో ( భ.గీత 4:34 ) " అన్నారు పరమాత్మ గీతలో.
శ్రీరంగం గోపాలరత్నం గారి కుటుంబం మాగ్రామంలో ఉండేవారు మా అమ్మగారి చిన్నతనంలో. వారి నాన్నగారు ఉపాధ్యాయులు.
ఎంత కష్టపడ్డారో, ఎంత సాధన చేసారో. కారణజన్ములు. అటువంటివారిని ఓసారి జ్ఞాపకం చేసుకున్నా తరిస్తాం.
నేడు శ్రీరంగంవారి వర్ధంతి. నివాళులు అర్పించుకుందాం - సూర్య.
శుభం భూయత్
Comments
Post a Comment