సమస్తమూ విరాట్ పురుషుని నాభినుంచే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 

ఉపనిషత్తులు ఇలా తెలియచేస్తున్నాయి :

" ఆకాశాత్ వాయుః,   

 ‌ వాయోరగ్నిః, 

  అగ్నేరాపః, అద్భ్యః పృధివీ, 

  పృధివ్యాత్ ఔషధీయః,   

  ఔషధీభ్యో అన్నం, 

  అన్నాత్ పురుషః " అని.

అంటే " ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమివలన ఔషధులు, వాటినుంచి అన్నం, అన్నం నుంచి జీవులు " అని అర్ధం. అన్నం వలననే జీవులు ( మనం ) జీవిస్తున్నాయంటే వీరి మనుగడకు మూలం ఆకాశం అని అనుకోవాలి.

ఋగ్వేద భాగమైన " పురుషసూక్తం " లో ఇలా ఉంది:

" చంద్రమా మనసో జాతః, 

  చక్షోః సూర్యో అజాయత, 

  ముఖాదింద్రశ్చాగ్నిశ్చ, 

  ప్రాణాద్వాయురజాయత, 

  నాభ్యా ఆసీదంతరిక్షం...... " 

విరాట్ స్వరూపాన్ని ( సహస్రశీర్షాపురుషః సహస్రాక్షః సహస్రపాత్....) వర్ణిస్తూ ఋషులు తెలియచేసినది ఆయన " నాభి " లోంచి ఆకాశం పుట్టిందని.

ఇప్పుడు పై రెండు విషయాలు పరికిస్తే అర్ధమయ్యేది " నాభి " యే మన మనుగడకు మూలం అని, జీవులకు కావలసినవి అనగా గాలి, నీరు, అగ్ని, అన్నం అన్నీ " స్వామి " నాభిలోంచే వస్తున్నాయని. అక్కడనుంచే సృష్టి మొదలయ్యిందని. ఎంత అద్భుత విషయం. అందుకే పూర్వీకులు " నాభి " కి అంతటి విలువనిచ్చారని అనుకోవచ్చు.

దీనిని గ్రహించే శిశువు " బొడ్డుతాడు " ని తాయత్తులో చుట్టించి అదే శిశువు మొలకు కట్టే సంప్రదాయాన్ని ఏర్పాటు చేసి ఉంటారు మన పూర్వీకులు. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే ఈ బొడ్డుతాడుని దేనికి ఎలా వాడాలో లాంటివి కూడా చెప్పే ఉంటారు. సుదీర్ఘ పరాయిపాలన వల్ల అటువంటి అద్భుత విషయాలు మరుగునపడిపోయి ఉండవచ్చు. 

కొన్నిరోజుల క్రితం ఒక పోష్ట్ చదివాం. కొన్ని దినుసులతో తయారు చేసిన తైలాన్ని బొడ్డు చుట్టూ లేక బొడ్డు మీద మెల్లగా మర్దనా చేస్తే చాలా వ్యాధులు తగ్గుతాయి/నయమవుతాయి అని. ఈ విషయాలన్నీ మన ఆయుర్వేద గ్రంధాల్లో ఉండే అవకాశముంది. ఇప్పటికైనా దానిమీద తగినంత శ్రద్ధ పెడతారని ఆశిద్దాం.

అందుకే ఆ వైద్యాన్ని " ఆయుర్వేదం " అని పిలుస్తూ వేదానికి ఇచ్చిన గౌరవం ఇచ్చారు.

భారతీయ సనాతనధర్మం, సమాజం పరిరక్షించబడతాయని ఆశిద్దాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ