సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి...." వివేకానందులు అంటారు " ప్రపంచవాజ్మయం అంతా నాశనమయిపోయినా ఒక్క రామాయణం ఉన్నా లేక ఒక్క సీతమ్మను జ్ఞప్తిలో ఉంచుకున్నా భారతజాతి ( సనాతనధర్మం ) మరి కొన్నివేల సంవత్సరాలవరకూ నిలిచి ఉంటుంది " అని. ఎందుకని అంటే " శ్రీరాముడు లాంటి అందగాడు, ధీరోదాత్తుడు, ధర్మపరుడు ఇంకొకరు కనబడవచ్చు శ్రద్ధగా వెదికితే కాని సీతమ్మలాంటి స్త్రీ మాత్రం దొరకదు కాక దొరకదు " అని ఆయన నొక్కి వక్కాణించారు. అమ్మ కౌసల్యను అనునయించి ఒప్పించిన తరువాత రాముడు సీతమ్మ దగ్గరకు వెడతాడు ఆవిడను కూడా అనునయించి అరణ్యవాసానికి బయలుదేరడానికి. " మా తండ్రి నన్ను వనవాసానికి వెళ్ళమన్నారు " అని మాత్రం అనగానే సీతమ్మ " నేను కూడా మీతో పాటే " అంది. మిమ్మల్ని అనుసరిస్తాను అనలేదు. మీముందుండి మీమార్గంలో ఉండే ముళ్ళు రాళ్ళు తొలగిస్తూ మీమార్గం సుగమం చేస్తాను అంది తల్లి. ఇక్కడ సీతమ్మ ఒక ధర్మసూక్ష్మం తెలియచేసింది జాతికి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, సంతానం ఎవరికయినా ఎవరి భాగ్యం వారిదే, ఎవరి కష్టాలు వారివే. కాని ఒక్క భార్యాభర్తలదే ...
Comments
Post a Comment